కాశ్మీర్, 75 ఏళ్లగా అన్యాక్రాంతంలో ఉండటంతో అక్కడ ఉన్న కొందరు అధికారులు కూడా పాక్ మరియు వారి ప్రేరేపిత తీవ్రవాద గణాలతో స్నేహితులుగా మసలడం అలవాటు అయిపోయింది. అందుకే ఇటీవల పాక్ ఉగ్రనేతలు కాశ్మీర్ జైళ్లలో ఉన్నప్పటికీ, బయట ఉన్న స్లీపర్ సెల్స్ యాక్టీవ్ చేయబడ్డాయి. కారణం, జైళ్లలో ఉన్న ఉగ్రనేతలు ఎంచక్కా అధికారుల వద్ద మొబైల్ లను తీసుకోని ఏకంగా పాక్ కు కూడా కాల్ చేసి మాట్లాడేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ ఆయుధాలు దాచిపెట్టింది స్లీపర్ సెల్స్ కు కాల్ చేసి మరి చెప్పేస్తున్నారు. దీనితో వాళ్ళు యాక్టీవ్ అయ్యి, విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇదంతా పెద్ద తలనొప్పిగా ఉండటంతో  చాలా మంది అధికారులను మార్చడం ద్వారా అక్కడ ప్రక్షాళన చేసినా ఇంకా ఇలాంటివి కొనసాగుతుండటంతో, కేంద్రం కొత్త నిర్ణయం తీసుకోకతప్పలేదు. కాశ్మీర్ లో పట్టుకున్న ఉగ్ర నేతలను భారత సైన్యం యూపీకి తరలించాలని నిర్ణయించింది.

దీనిద్వారా యూపీలో ఉగ్రనేతలకు తెలిసిన వారు ఉండరు కాబట్టి వాళ్ళ ఆగడాలు సాగవు. ఏమైనా ఎక్కువ చేస్తే, వాళ్ళను యోగి ప్రభుత్వం కాల్చి పారేస్తుందనే ఉద్దేశ్యంతో అక్కడకు మార్చారు. అంటే కాశ్మీర్ లో ఉన్న అధికారులు భయం లేదా మతం లాంటివి అడ్డుపెట్టుకొని పాక్ చెప్పింది చేయడం అలవాటు పడ్డారు. ఆ స్థితిలో అక్కడ పరిస్థితిని సరిదిద్దటం సాధ్యం కానిపని అందుకే కేంద్రం ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇకమీదట కాశ్మీర్ లో ఏ తీవ్రవాద నేత పట్టుబడ్డా అతడిని వేరే ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు.

తద్వారా ఈ నేతలు స్లీపర్ సెల్స్ ను కాంటాక్ట్ అయ్యే అవకాశాలు బాగా తగ్గినట్టే. భారత్ ఒకపక్క చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసుకుంటూ, మరోపక్క పాక్ కాశ్మీర్ ను ఆక్రమించకుండా చూసుకుంటూ, అలాగే దేశంలో పొంచి ఉన్న స్లీపర్ సెల్స్ ను యాక్టీవ్ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాసేపు ఆపినా దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఈ మూడు దారులు సిద్ధంగా ఉన్నాయి. తద్వారా భారత్ ను కోలుకోలేని దెబ్బ తీయాలన్నది వాళ్ళ వ్యూహం. కరోనా సమయంలో భారత్ అనూహ్యంగా అందరికంటే ముందుగా బయట పడటాన్ని వీరందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎప్పుడెప్పుడు భారత్ ను దెబ్బతీద్దామా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారు. అందుకే భారత్ ప్రతివిషయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: