తెలుగుదేశం పార్టీ బలపడాల్సిన సమయం ఆసన్నమైంది....ప్రజలకు వైసీపీ వల్ల ఉపయోగం లేదు....తామే మంచిగా చేయగలమని టీడీపీ నేతలు గట్టిగా చెప్పాలి. వైసీపీ పాలన ఎలా ఉందో ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళాల్సిన అవసరముంది. అలాగే టీడీపీ అవసరం ప్రజలకు ఎంత ఉందో చెప్పాలి. అప్పుడే టీడీపీ పికప్ అవ్వగలదు....పికప్ అయితేనే నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటగలదు. అయితే అలా పార్టీని పికప్ చేసే నాయకులు కావాలి. ఏదో మొక్కుబడిగా పనిచేసి...సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టేసి మమ అనిపించే నాయకులు మారాల్సిన అవసరముంది.

అలాగే చంద్రబాబు సైతం...నాయకులని మార్చాలసిన అవసరముంది. ముఖ్యంగా పార్లమెంట్ అధ్యక్షులని, గతనికి భిన్నంగా చంద్రబాబు జిల్లాల వారీగా అధ్యక్షులని పక్కనబెట్టేసి, పార్టీ బలోపేతం కోసం పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టారు. 25 పార్లమెంట్ స్థానాలకు 25 అధ్యక్షులని పెట్టారు. అయితే ఇందులో ఎంతమంది కరెక్ట్ గా పనిచేస్తున్నారు...ఎంతమంది పార్టీని పికప్ చేయగలుగుతున్నారంటే....సగానికి సగం సరిగా పనిచేయట్లేదనే చెప్పాలి.

ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టి ఏడాది దాటేసింది...ఏడాదిలో చాలా పార్లమెంట్ స్థానాల్లో పెద్దగా మార్పు ఏమి రాలేదు. ఇంకా చాలాచోట్ల టీడీపీ పరిస్తితి అలాగే ఉంది. ఇంకా అలాంటి చోట్ల అధ్యక్షులని మార్చి...సత్తా ఉన్న నాయకులకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. 25 పార్లమెంట్ స్థానాల్లో...సగం వరకు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పికప్ అవ్వలేదనే చెప్పాలి.

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల పరిధిలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. ఇటు నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో అదే పరిస్తితి. ఇక మచిలీపట్నం, అమలాపురం, అరకు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వలేదు. కాబట్టి ఈ స్థానాలపై చంద్రబాబు ఎక్కువ ఫోకస్ చేసి...నాయకులకు క్లాస్ తీసుకునో..లేక నాయకులని మార్చేసి పార్టీని బలోపేతం అయ్యేలా చేయాల్సిన బాధ్యత చంద్రబాబుది. చంద్రబాబు ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: