పెట్రోల్ డీజిల్ పై బాదుడు ఇంకెంతకాలం? పెరగడమే తప్ప తగ్గడమే లేదు. అగ్గిపుల్ల అంటిస్తే చెలరేగే చమురుకు ధరలు పెంచి మంట పెడుతున్నారు. దీంతో సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రేకుల్లేని బండిలా రేట్లు దూసుకుపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ మాటెత్తితే చాలు జనం హడలెత్తిపోతున్నారు. ఈ వారం లో వరుసగా ఐదవ రోజు 36 పైసలు పెట్రోల్ పై పెరిగింది. ఈ నెలలో ఈ రోజు వరకు 5.28రూపాయలు పెరిగింది. ఇవాళ హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 111.91 పైసలుగా ఉంది. 2020 మే ప్రారంభం నుంచి చూస్తే లీటర్ పెట్రోల్ ధర 37 డీజిల్ ధర 26.58 పైసలు పెరిగినట్టయింది. ఏడాదిన్నర కాలం లోనే ఈ స్థాయిలో ధరలు పెరిగిపోవడం పట్ల వాహనదారులు  గగ్గోలు పెడుతున్నారు. గత పది రోజుల్లో పెట్రోల్ పై2.91 పైసలు పెరిగింది. డీజిల్ పై 3 రూపాయలు పెరిగింది. రోజు పైసలు పెరుగుతూ పెద్దగా కనిపించకపోయినా మూడు రోజుల్లో సరాసరి ఒక రూపాయి చొప్పున భారం పడుతోంది.

ఇక నెల రోజుల్లో పది రూపాయల వరకు పెరుగుతుంది. ఏపీలో ఈ నెలలో 5.3 పైసలు పెరిగింది. ఇవాళ 27 పైసలు పెరిగి 113. 49 పైసలుగా ఉంది. డీజిల్ 46 పైసలు పెరిగి 106.50 పైసలు గా ఉంది. 2020 మే 5న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రికార్డు స్థాయిలో పెంచింది. ఒకవేళ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచక పోయినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు తగ్గి వాహనదారులకు మరింత చౌకగా అందుబాటులోకి వచ్చేది. కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాహనదారులకు ఊరట లభించలేకపోయింది. ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ పై 32.9, డీజిల్ పై 31.8గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 85 డాలర్ల స్థాయికి పెరిగింది.  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధనాల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతోంది. కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టి ప్రపంచ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఇవి ముడిచమురు ధరలు పెరిగేందుకు దారితీస్తున్నాయి. ఫలితంగా ముడిచమురు ధరలు ఎగబాకుతున్నాయి . దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల కు అనుగుణంగా దేశీయంగా ఇంధనాల ధరలు దూసుకుపోతున్నాయి. దీనివల్ల వాహనదారులపై భారం పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: