భారత్ తాజాగా వందకోట్ల వాక్సిన్ పంపిణి ఉత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే దానిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అసలు వంద కోట్ల వాక్సిన్ ఎప్పుడు ఇచ్చారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 23 కోట్ల డోసులు మాత్రమే పంపిణి అయినట్టు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. దేశంలో ని సరిహద్దులలో చైనా అనేక సమస్యలు సృష్టిస్తుంటే, బీజేపీ మాత్రం వంద కోట్ల పండుగ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుందని ఆయన విమర్శించారు. గత పదిహేను రోజులలో 20 మంది హిందువులు, సిక్కులు హత్యకు గావించబడ్డారు, 18 మంది సైనికులు మృతి చెందారు. ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ వందకోట్లు అంటూ ప్రచారం చేసుకుంటుంది.

అసలు వంద కోట్ల పంపిణి జరిగినట్టు లెక్కలు ఎవరు చూశారు అని రౌత్ ప్రశించారు. దానికి సమాధానంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, పంపిణి చేసే ముందు లెక్కలు లేకుండా ఎలా చేస్తారు అని తిరిగి ప్రశ్నించారు. ఆ మాత్రం జాగర్తలు తీసుకోకుండా పంపిణి చేయడం ఎలా వీలవుతుందో రౌత్ చెప్పాలని బీజేపీ నేతలు అన్నారు. జనవరి 16 నుండి అక్టోబర్ 21 వరకు దేశంలో వందకోట్ల వాక్సిన్ పంపిణి జరిగినట్టు కేంద్రం వద్ద లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండా ఇష్టానుసారముగా విపక్షాలు మాట్లాడటం సరికాదని వారు అన్నారు. దేశం పరిస్థితి ఎలా ఉంది, అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నది ఎప్పటికప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలు క్షుణంగా పరిశీలిస్తున్నాయని, ప్రభుత్వం ఏమేమి చేయాలో మరొకరు చేత చెప్పించుకునే అలవాటు బీజేపీ కి లేదని వారు అన్నారు.  

విమర్శలు చేసేముందు దేశంపట్ల ఔన్నత్యం లాంటివి కనీస పౌరుడికి ఉండాలి, కానీ ఒక పార్టీ నేత అయిఉండి కూడా ఆ మాత్రం తెలియకుండా శివసేన నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. ఒక్కసారి దేశంలో, చుట్టుపక్కల ఏమి జరుగుతుందో తెలుసుకుంటే పరిస్థితి అవగాహన అవుతుంది. అలా కాకుండా కేవలం ప్రభుత్వం పై బురద జల్లడానికే అంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. చైనా, పాక్ లు ఏమేమి చేస్తున్నది చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు, వాటి గురించి మీరేమి ఆందోళన పడాల్సిన పనిలేదు. దేశభద్రతకు బీజేపీ ప్రాణం ఇస్తుంది అనేది అందరికి తెలుసు. దేశద్రోహుల స్థాయిలో మీరు లేకుండా చూసుకుంటే మాకు అదే పదివేలు అంటూ బీజేపీ కూడా శివసేన నేతపై విరుచుకుపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: