చెడపకురా చెడేవు అనే సామెత గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇదే సామెత పాకిస్థాన్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎన్నో ఏళ్ల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఉగ్రవాదులు ఉన్నప్పటికీ కేంద్ర బిందువు మాత్రం పాకిస్తాన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ ప్రజల గురించి పట్టించుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మత రాజ్య స్థాపనే లక్ష్యంగా ఎన్నో అల్లకల్లోల పరిస్థితులు కూడా సృష్టించింది పాకిస్తాన్. అయితే అటు తమ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ సంక్షోభంలో కూరుకుపోతున్నప్పటికి అవేవి పట్టించుకోకుండా ఉగ్రవాదులను పెంచి పోషించడం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది.



  అయితే మొన్నటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పిందే వేదంగా భావించిన అక్కడి ప్రజలు ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ సరిహద్దుల్లో ఇలాంటి నిరసన జ్వాలలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయింది అని చెప్పాలి. అంతేకాదు పాకిస్తాన్ పెంచిపోషించిన ఉగ్రవాదులే ఇక ఇప్పుడు పాకిస్తాన్ కి సమస్యగా మారబోతున్నారు అన్నది అర్థం అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకూ కేవలం రహస్య కార్యకలాపాలను జరిపిన ఉగ్రవాదులు ఇక ఇప్పుడు మాత్రం బహిరంగంగా తెరమీదికి వస్తూ ఉండడం పాకిస్తాన్ ప్రజలని షాక్ కి గురి చేసింది.


 ప్రస్తుతం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఏకంగా బహిరంగంగా వచ్చి కొన్ని మసీదుల ముందు జెండాలు ఎగుర వేస్తున్న.. కనీసం ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించే ధైర్యం కూడా అక్కడ ఎవరికి లేక పోయిందట.  ఇక ఇప్పుడు తీవ్రవాద సంస్థలు బహిరంగంగా ఊరేగింపులు చేయడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఇలా బహిరంగంగా ఉగ్రవాదులు ఊరేగింపు నిర్వహించగా ఇదేంటి అంటూ ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు  ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా మరికొంత మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన తర్వాత అసలు దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న దానిపై మాత్రం అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: