ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు అందరి లక్ష్యం ఒకటే. మత రాజ్యస్థాపన చేయాలన్నది. ప్రపంచవ్యాప్తంగా మత రాజ్య స్థాపన చేసి ఇస్లామిక్ పాలన కొనసాగించాలి అనే లక్ష్యంతోనే ఉగ్రవాదులు అందరూ అరాచకాలకు పాల్పడుతున్నారు. అయితే మత రాజ్య స్థాపన కోసమే తాలిబన్లు ఆయుధాలను చేతపట్టి ఎంతోమంది ప్రాణాలు తీసి చివరికి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ వశం చేసుకున్నారు. ఇటీవలే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇస్లామిక్ చట్టాలను అమలులోకి తీసుకు వచ్చారు. ఇస్లామిక్ పాలన సాగిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు.


  అయితే ప్రస్తుతం తాము ఆధిపత్యాన్ని సాధించడంతో తాలిబన్లు కాస్త ప్రశాంతంగానే ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆప్ఘనిస్తాన్లో మాత్రం బాంబు పేలుళ్లు కాల్పులు మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో ఇస్లామిక్ పాలన కొనసాగుతున్నప్పటికీ రెచ్చిపోతూ తాలిబన్లను  వ్యతిరేకిస్తూ ఆఫ్ఘనిస్తాన్ లో  ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల తరచుగా బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉన్నారు.



 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. అయితే అటు తీవ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఏకంగా కరెంట్ సరఫరా చేసే స్టేషన్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ ని చీకటి పొరల్లోకి నెట్టారు. ఇక దీనిని సవాలుగా తీసుకుని తాలిబన్లు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆటలు కట్టించడానికి ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న  ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను మట్టి కరిపించాలని  ప్రస్తుతం తాలిబన్లు కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: