పాక్ చరిత్రలో ఇమ్రాన్ మరో చేతకాని ప్రధానిగా మిగిలిపోయాడు. ఈయన కాలంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని పాక్ ఎదురుకొంటుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దాదాపుగా ఆఫ్ఘన్ కంటే మెరుగ్గా మాత్రం లేవని నిపుణులు అంటున్నారు. అక్కడ నిత్యావసర సరుకుల నుండి ప్రతిదీ ఆకాశాన్ని అంటే ధరలతో ఉందని ప్రజలు కూడా విసిగెత్తిపోయారని వారు అంటున్నారు. అందుకే తాజాగా ప్రజలు కూడా రోడ్డెక్కి తీవ్రంగా ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు చేశారు. ఆయనను రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. పాక్ ప్రతిపక్షం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా కరాచీ విధులలో చేరి ఈ ఆందోలన లో పాల్గొన్నారు. ధరల పెరుగుదల, తీవ్రమైన నిరుద్యోగం, గ్యాస్, విద్యుత్ లాంటివి సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా అయిపోయాయి. ఈ స్థితిని అదుపు చేయలేకపినందుకు ఇమ్రాన్ ఖాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలనీ వారు డిమాండ్ చేశారు.

పాక్ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, కార్మికులు ఈ నిరసన ప్రదర్శనలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా రాసిన బ్యానర్ లను కార్మికులు ప్రదర్శిస్తూ ముందుకు కదిలారు. కనీసం సామాన్యులు రెండు పూటలా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానిగా ఇమ్రాన్ అనర్హుడని జామియాట్ ఉలేమా ఇ ఇస్లాం సంస్థ నేత రషీద్ సుమ్హ్రో విమర్శించారు. ప్రజల కష్టాలు తీర్చలేని ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలనీ వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళలన కార్యక్రమంలో అల్లర్లు చెలరేగకుండా రక్షణ ఏర్పాటు చేశాయి భద్రతా సిబ్బంది. అయితే అనుకోకుండా జరిగిన ఘటన వలన ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. నిరసన కారులు రక్షణ దళంలోని సభ్యులను హత్య చేశారు, అనేక మంది ఆందోళన కారులు కూడా ఈ గొడవలలో గాయపడ్డారు. ఆందోళన కారులు లాహోర్ నుండి ఇస్లామాబాద్ వైపు వెళుతుందట అడ్డుకున్న భద్రతా దళాల మధ్య ఈ ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. అయితే తాలిబన్ సహా ఇతర ఉగ్ర సంస్థలు ఇటీవల ఇమ్రాన్ చర్యలు నచ్చక, తమకు అనుకూలమైన వాడిని గద్దెనెక్కించడానికి ఈ తరహా ఆందోలన తెరపైకి తెచ్చినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: