నేడు కేంద్ర మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ప్రాంతీయంగా ఉన్న గురుద్వారా ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ చేసింది ఏంటో అందరికి తెలుసు, దాని ప్రయోజనాలు అందరు అనుభవిస్తున్నారు. కానీ గతంలో ఇదంతా మూడు కుటుంబాలకు చెందినదిగా ఉండేది. అప్పుడు వాళ్ళు కూడా దేశానికి కాకుండా, పక్కనవాళ్ల తొత్తులుగా పనిచేస్తూ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా ఏళ్లతరబడి వెనక్కి తీసుకెళ్లారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా వాళ్ళ చేతిలో ఈ ప్రాంతం ఉందంటే వాళ్ళు ఎంతగా నాశనం చేసి ఉంటారు అనేది ప్రజలు కూడా స్వయంగా చూసిందే. కేవలం కొద్ది కాలంలో బీజేపీ చేసినది కూడా ప్రజలు చూశారు. అయినా ఇప్పటికి ఆ కుటుంబాలు పెత్తనం చేయాలని దేశద్రోహ తరహా పనులు చేస్తే ఉపేక్షించేది మాత్రం లేదు.

బీజేపీ కాదు, దేశప్రజలే ఇలాంటి వారికి సరైన బుద్ది చెపుతారని ఎన్నికలలో తెలుస్తూనే ఉంది. కేవలం మూడు కుటుంబాల నుండి 6 ఎంపీలు, 87 మంది ఎమ్మెలేలు ఉన్నా జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను సాధారణ స్థితికి తేలేకపోయారు. అంటే ప్రజలు అర్ధం చేసుకోవాలి, వాళ్ళు ఎవరి కోసం ఇన్నాళ్లు పదవులలో ఉన్నారో అనేది. ఇలాంటివారు పాలించబట్టే దేశం ప్రేమించే గుండె లాంటి ఈ ప్రాంతం ఎలా ఉందొ అందరు చూస్తున్నారు. కేవలం మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే ఇక్కడ శాంతి నెలకొంది. ఈ మాత్రం అయినా సాధారణ ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు కుదురుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా జీవించేవరకు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కదిద్దే వరకు మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయబోదు.

మోడీ రాజ్యంలోనే ఇక్కడ నేడు గ్రామ స్వరాజ్యం సాదించగలిగాము. అందువలననే ఇప్పుడు ప్రతి గ్రామంలో పంచాయితీ పాలన కొనసాగుతుంది. అందుకోసం 30 వేల మంది నిరంతరం కృషి చేస్తున్నారు. వీళ్లంతా సజావుగా పనిచేసే స్వాతంత్రం ఉంది, దానికి ఎవరు అడ్డువచ్చినా చూస్తూ ఊరుకునేది మాత్రం మోడీ ప్రభుత్వం కాదని బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: