ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హోదాకు క్యాబినేట్ మినిస్ట‌ర్ హోదాను క‌ల్పించాడు జ‌గ‌న్. గ‌తంలో వైఎస్సార్ హ‌యాంలో స‌ల‌హాదారుగా కేవీపీ చ‌క్రం తిప్పాడు. కానీ ఆయ‌న మీడియా ముందుకు రాలేదు. ఆ రోజు కేవీపీ మీడియా ముందుకు రాక‌పోయినా, ప‌బ్లిక్ స‌ర్కిల్స్ లో పెద్ద‌గా మాట్లాడ‌క‌పోయినా త‌న ప‌ని తాను చేసుకుని పోయారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇమేజ్ ను పెంచేందుకు అన్ని విధాలా ఎప్ప‌టికప్పుడు కృషి చేసేవారు. త‌న‌కున్న ప‌లుకుబ‌డిని పూర్తిగా వినియోగించుకుని పార్టీని గాడీలో పెట్ట‌డ‌మే కాకుండా, పార్టీకి, సీఎంకు మ‌ధ్య అగాధం అన్న‌ది లేకుండా అడ్డు అన్న‌ది లేకుండా చేయ‌గ‌లిగారు. టిక్కెట్ల కేటాయింపులో కూడా ఆ రోజు వైఎస్, కేవీపీ ఇద్ద‌రూ చ‌ర్చించుకునే లిస్ట్ ఫైనల్ చేసేవారు. అంత‌గా కేవీపీ దూసుకుపోయారు.ఇప్ప‌టికీ వైఎస్ ఇంటి గుట్టు మొత్తం కేవీపీకే ఎరుక. అయితే కాల గ‌తిలో వైఎస్ చ‌నిపోయాక కేవీపీ పూర్తిగా దూరం అయ్యారు ఆ కుటుంబానికి. పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు కూడా! జ‌గ‌న్ సీఎం అయ్య‌క కూడా త‌న‌కు తృప్తి లేద‌ని ఆయ‌న కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ నుంచి  గెలిచి ఉంటే ఆనందించి ఉండేవాడ్ని అని కూడా స్ప‌ష్టం చేశారు.


జ‌గ‌న్ కూడా మొద‌ట్నుంచి కేవీపీని దూరం పెడుతూనే ఉన్నారు. తండ్రి  ఉన్న‌ప్పుడు కొన్ని విభేదాలు ఇద్ద‌రికీ ఉన్నాయ‌ని అవ‌న్నీ తెర‌పైకి తెచ్చే క‌న్నా దూరం గా ఉంచ‌డ‌మే బెట‌ర్ అని ఆలోచ‌న చేశారు జ‌గ‌న్. అదే అమ‌ల‌యింది కూడా! నిన్న‌మొన్న‌టి వేళ వైఎస్ వ‌ర్థంతికి హాజరు కావ‌డం మిన‌హా కేవీపీ పెద్ద‌గా ఆ కుటుంబంతో స‌న్నిహితంగా లేరు. విజ‌య‌మ్మ వెలువురించిన నాలో నేను నాతో నేను వైఎస్సార్ అనే పుస్త‌కంలోనూ కేవీపీ ప్ర‌స్తావ‌న లేదు. ఈ త‌రుణంలో కేవీపీ పూర్తిగా ఆ కుటుంబానికి దూరం అయ్యారు అన్న‌ది నిర్థార‌ణ అయింది. బిట్వీన్ ద టైమ్.. రామ కృష్ణా రెడ్డి స‌జ్జ‌ల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు జ‌గ‌న్. సాక్షి ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్ గా ఉన్న ఆయ‌నకు ముందు తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్ద‌మ‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కానీ ఆ స‌మ‌యంలో ఆయ‌న అంత‌ర్గ‌త విభేదాల‌ను స‌రిదిద్ద‌లేక అవ‌స్థ‌లు ప‌డ్డారు. అప్పుడు ఆయ‌న స‌క్సెస్ కాలేక‌పోయారు. పార్టీకి సంబంధించి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం మినహా పూర్తిగా తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న చేసిన కృషి ఏదీ కూడా స‌ఫ‌లీకృతం కాలేదు. అయితే రాష్ట్రం విడిపోయాక ఎవ‌రి దారి వారు చూసుకున్నాక పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పూర్తి స్థాయిలో చాలా బాధ్య‌త‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హోదాలో ఆయ‌నకు అనేక ప‌నులు అప్ప‌గించారు జ‌గ‌న్.

సీఎం త‌ర‌ఫున మాట్లాడే వ్య‌క్తిగా త‌రువాత ఆయ‌న స్థిర‌ప‌డిపోయారు. ఇప్పుడు జ‌గ‌న్ ఆత్మ‌గా పేరు తెచ్చుకుంటున్నారు. స్వ‌భావ రీత్యా సున్నిత మ‌న‌స్కుడు అయిన ఈయ‌న కొన్ని నిర్ణ‌యాల అమలులో క‌ఠినంగా ఉంటున్నారు. మంత్రులను క‌ట్ట‌డి చేయ‌డంలో
ఆయ‌న‌దే ప్ర‌ధాన పాత్ర. అందుకే ఇటీవ‌ల విశాఖకు వ‌చ్చిన ఆయ‌న‌కు మంత్రులు ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ అనే  ఓ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లికి హాజ‌ర‌యిన ఆయ‌కు మంత్రులు స్వాగ‌తం ప‌లికిన తీరే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp