హుజురాబాద్‌లో బీజేపీ నేత‌కు టీఆర్ఎస్ ప్ర‌చారం చేస్తుందా అని అనిపిస్తోంది జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే. తాజాగా మంత్రి కేటీఆర్  ఈట‌ల‌, రేవంత్ రెడ్డి భేటీ అయ్యార‌ని అన‌డం అదేదో త‌మ‌కు మాత్ర‌మే తెలిసిన ర‌హ‌స్యం అన్న‌ట్టుగా వీళ్ల భేటీతో తెలంగాణ రాష్ట్రానికి ఏదో న‌ష్టం జ‌రిగిపోతుంద‌న్న‌ట్టుగా ఉంది మంత్రి కేటీఆర్ మాట‌లు. మ‌రి ఈట‌ల త‌మ‌కు ప్ర‌త్య‌ర్థి యే కాద‌ని సీఎం కేసీఆర్‌తో స‌హా ఆ పార్టీ నేత‌లు అంటున్న మాట‌లు ఇవి.


  అలాంట‌ప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ గురించిన ప్ర‌స్తావ‌న ఎందుకు తీసుకువ‌స్తున్నారు..?  హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో భాగంగా  పొద్దున లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప్ర‌చారం ముగిసే వ‌ర‌కు ఈట‌ల పై టీఆర్ఎస్ ఆరోప‌ణలు, విమ‌ర్శ‌లే ప‌ని పెట్టుకోవ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్ర‌వేశ పెట్టిన, పెడుతున్న ప‌థ‌కాల గురించి చెప్పుకోవడం వ‌దిలేసి ఎంతసేపు ఈట‌ల‌కు గురించి మాట్లాడ‌డం చూస్తుంటే ఈట‌ల‌కు టీఆర్ఎస్ పార్టీయే  ప్ర‌చారం చేస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.


దీనికి తోడు ఈట‌ల రాజేంద‌ర్‌, రేవంత్ రెడ్డి ర‌హ‌స్య భేటీ జ‌రిగంద‌నే మాట కేటీఆర్ నోట రావ‌డం స‌బ‌బు కాద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి ఈట‌ల మాట్లాడుతూ.. అవును తాము క‌లుసుకున్నామ‌ని అందులో త‌ప్పేముంద‌ని ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఈట‌ల‌, రేవంత్ క‌లిస్తే ఏంటి, క‌ల‌వ‌క‌పోతే ఏంటి  దీని వ‌ల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా న‌ష్ట‌మా అని అంటున్నారు కొందరు. ఇక రేవంత్ , ఈట‌ల భేటీ గురించి టీఆర్ఎస్ నేత‌లంతా మూడు రోజులుగా ఒక‌టే గోల చేస్తున్నారు.


  త‌మ పార్టీ గురించి, త‌మ ప‌థ‌కాల గురించి జ‌నాల‌కు చెప్పుకోకుండా ఈట‌ల‌, రేవంత్‌ల ప్ర‌స్తావ‌న ఏమ‌వ‌స‌రం అని అర్థం కావ‌డం లేదు. ఏదో విధంగా ఈట‌లను బ‌ద్నాం చేయాల‌నే క‌సితో టీఆర్ఎస్ ఈట‌ల‌కు బాగా ప్ర‌చారం చేసిపెడుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. దీంతో ఈట‌ల‌ను గెలిపించేది టీఆర్ఎస్ ఏన‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అయిన‌ట్టుగా మారింది టీఆర్ఎస్ ప‌రిస్థితి. ఈట‌ల‌పై విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలో గులాబీ పార్టీ చిక్కుకుంటుంద‌ని క‌నిపిస్తోంది. మ‌రి ఇప్పుడ‌యిన త‌మ పార్టీ గురించి ప్ర‌చారం చేసుకుంటే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: