గెలుపులో కాదు ఓట‌మిలో కూడా దేశానికి మ‌ద్దతు ఇవ్వ‌డ‌మే గొప్ప విష‌యం అని నెటిజ‌న్లు అంటున్నారు. శివ క్రిష్ అనే ఓ విజ య‌న‌గ‌రం అభిమాని త‌న భావోద్వేగాన్ని ఏక వాక్య రూపంలో ముందుంచారు. ఆయ‌నే కాదు చాలా మంది ఇదే విధంగా స్పందించా రు.20 - 20 లో గ్రూప్ 1 మ్యాచ్ లో భార‌త్ ఓడిపోవ‌డం, అదీ పాకిస్థాన్ పై ఓడిపోవ‌డం అన్న‌ది పెద్ద విష‌య‌మేం కాద‌ని అంటున్నా రు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక క‌థ‌నం ఇది.

నిన్న‌టి వేళ భార‌త్ పాక్ మ్యాచ్  ను చాలా మంది దాయాదుల పోరు అని రాశారు. అది త‌ప్పు. దేశాల మ‌ధ్య జ‌రుగుతున్నది కేవ‌లం ఒక క్రికెట్ మ్యాచ్‌. అది ఓ యుద్ధం కాదు. ముందు అది గుర్తు పెట్టుకోవాలి. పాక్ మ‌న నుంచి విడిపోయిన దేశం. కొన్ని సంస్కృతులు ఇప్ప‌టికీ మ‌న క‌న్నా బాగా ఆద‌రించే ప్రాంతాలున్నాయి అక్క‌డ. ఒక‌దేశం మ‌రో దేశంతో త‌ల‌ప‌డే సంద‌ర్భంలో పాత కోపాలు ప్ర‌ద‌ర్శించ‌డం అస్స‌లు స‌బబు కాదు. టీం ఇండియా త‌ర‌ఫున మంచి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలో ఏ త‌ప్పూ లేదు కానీ మ‌రో దేశాన్ని అదే ప‌నిగా తిట్ట‌డం స‌రికాదు. దౌత్య బంధాలు బ‌లోపేతం చేసే దిశ‌గానే ఇరు వ‌ర్గాలూ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ స‌ఖ్య‌త‌తోనే ఉండాలి. ఉంటాయి కూడా!

ఇక టీం ఇండియా ఎన్నో ఘ‌న విజ‌యాలు అందుకుంది. మ‌న క‌న్నా పాకిస్తాన్ ఆట‌గాళ్లు బాగా ఆడార‌ని కూడా నిన్న రుజువైంది. ఇంకేం ఈ ఒక్క ఓట‌మితో టీం ఇండియా ప‌రువేం పోదు కానీ హాయిగా మరో ఆట‌కు సిద్ధం కండి కోహ్లీ. ఈ వేళ మీ ఓట‌మిలోనూ మీ గెలుపులోనూ ఈ దేశానికి చెందిన ఎందరో అభిమానులు ఉన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇవాళ మీకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఏం కాదు బాగా కృషి చేయండి. ఈ సంద‌ర్భంగా మీడియా కూడా దాయాదుల పోరు అన్న మాట‌ను విర‌మించుకుంటే మేలు.


యుద్ధ‌మేం జ‌ర‌గలేదు క‌నుక ఇలాంటి ప‌దాలు వాడ‌కండి ప్లీజ్.. ఇదొక్క‌టే విన్న‌పం. మైదానంలో దేశ భ‌క్తి గురించి గతంలోనూ రాశాను ఇప్పుడూ రాస్తాను. దేశాన్ని ప్రేమించండి అన్ని రంగాల పురోగ‌తికీ స‌హ‌క‌రించండం మ‌రువ వ‌ద్దు. అప్పుడే మీ దేశ‌భ‌క్తి నిరూప‌ణ‌లో ఉంద‌ని త‌ప్ప‌క భావిస్తాను. తోటి వారికి చేయూత ఇవ్వ‌కుండా మేరా భార‌త్ మ‌హాన్ అని చెప్పి ఊరుకోవ‌డంలో అర్థ‌మే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: