చైనా దురాక్రమణలు, కరోనా వ్యాప్తి లాంటివి చేస్తుండటంతో ప్రపంచ దేశాలు దానిపై దృష్టి మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉత్పత్తి అంటే చైనా వైపు చూసే వారు. అహంకారం ఎక్కువై కొట్టుకుంటుంది చైనా. కరోనా వ్యవహారంతో చైనా దుర్మార్గాలు అందరికి తెలిసిరావడంతో, అందరు వేరే దేశం వైపు చూడటం మొదలు పెట్టారు. అదే భారత్. భారత్  మొదటి నుండి నిదానంగా ఉండటం, కరోనా సమయంలో కూడా సంయమనం పాటిస్తూ అందరికంటే మెరుగ్గా ఆ వైరస్ ను ఎదిరించడం ప్రపంచాన్ని ఆకర్షించింది. దీనితో ఇప్పుడు భారత్ వైపు పెట్టుబడిదారుల చూపులు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఇంకా చెప్పాలి అంటే, ఒకప్పుడు పెట్టుబడులు అంటే చైనా గుర్తుకువస్తే, ఇప్పుడు భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించిందనే చెప్పాలి. రానున్న రెండేళ్లలో ఈ తరహా ఫలితాలు భారీగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనా ఉత్పత్తి అయితే విస్తరించింది కానీ, నాణ్యతకు ఏనాడూ పెద్ద పీట వేయలేకపోయింది. కానీ భారత్ లో ఆ తరహా అంచనా కూడా ఉండటంతో అందరు భారత్ వైపు చూస్తున్నారు.

ఇక ప్రాంతీయ సంస్థల విషయానికి వస్తే వాళ్ళు కూడా భారీగానే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ ఏడాదిలో కూడా లక్షలలో ఉద్యోగులను తీసుకోవడానికి సిద్ధం అయ్యాయి ఆయా సంస్థలు. టీసీఎస్, విప్రో, హెచ్సి ఎల్ సంస్థలు 2021 కి గాను 54000 మంది ఫ్రెషర్స్ ను తీసుకున్నారు. 2022లో కూడా ఈ సంస్థలు 160000 మందిని తీసుకోనున్నారు. చైనా వ్యవహారాల నేపథ్యంలో భారత్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి, దీనితో భారీగా మానవ వనరులు కూడా అవసరం పడుతుంది. ఐఫోన్ అసెంబ్లీ యూనిట్ చెన్నై లో ప్రారంభించారు. ఇదే సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా అడుగుపెట్టింది. ఇది 2024లోగ పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఈ వాహనాలు 700 కి.మీ. ప్రయాణించే సామర్థ్యంతో అందుబాటులోకి రానున్నాయి.

మరోవైపు 2021యునికార్న్ స్టార్ట్ అప్ ల ప్రారంభంలో కూడా భారత్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. వీటివిలువ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఇలాంటివి భారత్ లో 33 ప్రారంభించగా, చైనాలో 19 మాత్రమే ప్రారంభం అయ్యాయి. అయినా చైనాలో సంక్షోభం వలన అవి కూడా ముందుకు సాగె పరిస్థితి కనిపించడం లేదు. అంటే భారత్ వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తూ పోతుంది. దానికి ప్రస్తుత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: