ప్రపంచ దేశాలలో ప్రతి దేశానికి మిత్రత్వం ఉంది, అలాగే మిగిలిన వారితో అంటీముట్టనట్టు ఉండే స్వభావం ఉంది. అంటే ఒకరితో స్నేహంగా ఉండి, ఇంకా వారే అన్ని అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండేవాళ్ళు ఉన్నారు. నిజానికి కలివిడిగా ఉంటూ, మనపై ఆసక్తి చూపే వారిపై ఎక్కువగా స్నేహంగా ఉండటం సమంజసం. ఒకప్పుడు భారత్ కూడా ఒకదేశంపైనే దృష్టి సారించేది. పేరుకు అమెరికా ఉద్యోగాలు, స్నేహం మాత్రం రష్యా తో అన్నట్టే ఉండేది. కానీ అనంతరం ప్రభుత్వాలు ఆ తరహా వ్యవహారాలలో మార్పులు తెచ్చారు. అందులో వాజపేయి ప్రభుత్వం చెప్పుకోతగ్గ పరిణామాలు తేగలిగింది. అంటే అందరితో కలివిడిగా ఉంటూ వచ్చింది. తద్వారా అందరితో స్నేహభావాలు ఏర్పాటు చేయగలిగింది. అయితే మనమీద అక్కసు ఉన్నవాళ్లు ఎప్పుడు ఉంటారు కూడా, కానీ వాళ్ళతో కూడా కలివిడిగా ఉండటం వలన కనీసం వాళ్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది, శత్రువర్గం కూడా తగ్గిపోతుంది.

ఇదే తహారలో ఇప్పుడు ఇజ్రాయెల్ అడుగులు వేస్తుంది. ప్రపంచ దేశాలతో కలివిడిగా ఉండేందుకు కృషి చేస్తుంది. నిజానికి కరోనా దెబ్బతో ఇప్పటికే ఈ తరహా వాతావరణం ఏర్పాటు కావాల్సింది. కానీ ఎవరికి వారు ఉండాల్సిన అత్యవసరం పడింది కాబట్టి, ఇప్పుడిప్పుడే వైరస్ నుండి బయటపడ్డారు కాబట్టి, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆయా దేశాలతో కలిసి నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయాలతో కలిసిపోయేవారితో ఎక్కువగా ఉండటం లాంటివి. తద్వారా కలిసి నడవచ్చు, ఉమ్మడి అవసరాలు తీర్చుకోవచ్చు. ఇక ప్రపంచం మాత్రం పాక్, చైనా, తాలిబన్ ఆఫ్ఘన్ లకు మాత్రం దూరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రష్యా తో ఇజ్రాయెల్ కలిసి నడిచేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ తరహా ఉమ్మడి వ్యవహారాలు పెరిగితేనే ప్రపంచంలో పెరిగిపోతున్న ఉగ్రమూకలకు చెక్ పెట్టె అవకాశం ఉంటుంది. లేకపోతె వాళ్ళు నెమ్మదిగా ఆయా దేశాల పక్కలకు చేరి, ఇతర దేశాల మీద లేనిపోనివి చెప్పి, పగప్రతీకారం అంటూ విద్వేషాలను రెచ్చగొట్టి, విడతీసి పాలించు అనే అంశం ద్వారా వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రమాదం ఎంతైనా ఉంది. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆయా దేశాలు ఉమ్మడి ప్రయోజనాలతో ముందుకు పోతుండటం ఉత్తమం. అదే అందరికి శ్రేయోదాయకం కూడా. లేదంటే, ఉగ్రమూకలకు చిక్కిన పాక్ పరిస్థితి ఏవిధంగా అయిపోయిందో ప్రత్యక్ష ఉదాహరణ అందరికి కనిపిస్తున్నదే. అదే ఇతర దేశాలకు పెద్ద పాఠం.

మరింత సమాచారం తెలుసుకోండి: