గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అమేథీ లో రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నిక‌ల్లోనూ స్మృతి ఇరానీ ని దింపి అమేథీలో రాహుల్ ను ఓడించాల‌ని చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. అయితే అక్క‌డ ప్రియాంక గాంధీ తిష్ట వేసింది. దీంతో రాహుల్ చ‌చ్చీ చెడీ 1.15 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే గ‌త ఎన్నిక‌ల కు ముందే అమేథీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు బీజేపీ అధిష్టానం సామ ధాన దండోపాయాలు అన్ని ఉప‌యోగిం చేసింది. దీనికి తోడు అక్క‌డ రు. 1000 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. దీంతో రాహుల్ స్మృతి పై 74 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే అక్క‌డ ప‌రిస్థితి ముందే గ్ర‌హించిన రాహుల్ త‌న‌ను మోడీ , బీజేపీ వాళ్లు పార్ల‌మెంటు లో లేకుండా చేసే ప్లాన్ చేస్తున్నార‌ని మ‌రో సీటు నుంచి కూడా పోటీ చేశారు. అమేధీ తో పాటు సౌత్ లో కేర‌ళ లోని కాంగ్రెస్ కంచుకోట అయిన వ‌య‌నాడ్ నుంచి రంగంలోకి దిగారు. వ‌య‌నాడ్ లో రాహుల్ ఏకంగా 4 ల‌క్ష‌ల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీ తో గెలిచి అమేధీలో ఓడినా కూడా పార్ల‌మెంటు లో ప్ర‌తిప‌క్ష నేత‌గా అయితే ఉన్నారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ను కూడా కుప్పంలో ఓడించి ఆయ‌న అసెంబ్లీ లో లేకుండా చేసేందుకు జ‌గ‌న్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నాలు కొంత వ‌ర‌కు ఫ‌లిస్తున్నాయి. కుప్పం పైన కొంత వైసీపీ పట్టు సాధించడంతో పాటు ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేసి ఆధిపత్యాన్ని చాటుకోవ‌డంతో చంద్రబాబులో కంగారు , క‌ల‌వ‌రం మొదలయింది.

కుప్పం కోట‌ను కొట్టేందుకు జ‌గ‌న్ డైరెక్ష‌న్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పలు విస్తృతంగా పర్యటిస్తు వ‌స్తున్నారు. ఇక అక్క‌డ ఇన్ చార్జ్ గా ఉన్న భ‌ర‌త్ కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం ద్వారా అక్క‌డ వైసీపీని మ‌రింత స్ట్రాంగ్ చేసే ప‌నిలో ఉన్నారు. ఇక జ‌గ‌న్ కూడా రచ్చబండ కార్యక్రమంలో కుప్పంలో పర్యటించే ప్లాన్ వేసు కుంటున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: