సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డంలో రేవంత్ రెడ్డి ది అందే వేసిన చేయి. తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన త‌రువాత త‌న జోరును మ‌రింత పెంచారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీలు మాట‌లు తూటాళ్లా పేలుతున్నాయి. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేవుడా న‌క్స‌లైట్లు ఉంటే బాగుండేది వాళ్లు ఉన్నా భ‌య‌ప‌డే వాళ్లేమో అంటూ మాట్లాడారు.


ఆదివారం క‌రీంన‌గ‌ర్ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ ప‌రిస్థితి రావాలని కోరుకోవ‌డం లేద‌ని కానీ ఇక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ఆ ఆలోచ‌న వ‌స్తుంద‌ని చెప్పారు.  రాష్ట్రంలో పోలీసు శాఖ‌లో అధికారులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయార‌ని తెలిపారు. డీజీపీ టెలిఫోన్ కూడా ట్యాపింగ్ అవుతోంద‌ని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి మంత్రుల ఫోన్‌లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి కేంద్రానికి ఫిర్యాదు చేశార‌న్నారు.


ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌, కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ చేసే ఇద్ద‌రు పోలీసు అధికారులు త‌న‌పై త‌న కుటుంబం పై నిఘా పెట్టార‌ని ఆరోపించారు. మ‌రో అధికారి డీజీపీపై నిఘా పెట్టార‌న్నారు. రిటైర్ట్ అయిన వాళ్ల‌ను మ‌ళ్లీ  పోస్టింగ్‌లు ఇచ్చి ప్ర‌త్యేక నిఘా కోసం ద‌ళాల‌ను ఏర్పాటు చేశారని  రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ బంధువును ఆంధ్రా నుంచి డిప్యూటేష‌న్ మీద హైద‌రాబాద్  తీసుకొచ్చి పోస్టింగ్ ఇచ్చార‌ని ఆరోపించారు. ఆర్.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అంత‌ర్జాతీయ తీవ్ర‌వాదా..? ఆయ‌న్ను , ఆయ‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న వారిని ఎందుకు వేధిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.


తెలంగాణ‌లో ఇంత‌టి నిర్భంధం చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అనే వ్యాపార సంస్థ‌లో వాటాల స‌మ‌స్య వ‌చ్చింద‌ని, త‌న‌కు వాటా త‌క్కువ అయ్యింద‌ని  ఈట‌ల కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. దీంతో ఆదిపత్య పోరు మొద‌లైంద‌న్నారు. ఎండీ కేసీఆర్‌కు డైరెక్ట‌ర్ ఈట‌ల‌కు మ‌ధ్య గొడ‌వ‌లో త‌న‌కు స‌మానా వాటా కావాల‌న్న విష‌యంలో గొడ‌వ జ‌రిగింద‌ని ఆరోపించారు. దీంతో ఈట‌ల‌ను కంపెనీ నుంచి బ‌య‌ట‌కు పంపార‌ని విమ‌ర్శించారు.












మరింత సమాచారం తెలుసుకోండి: