చైనా ఎలాగైనా సరిహద్దులలో పై చేయి సాధించాలని తాజాగా తన ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఏ దేశమైన దానికి తగ్గట్టుగానే చట్టాలను రూపొందించుకోవడం సహజం. అయితే చైనా మాత్రం పక్క దేశాల సరిహద్దుల కోసం కొత్త చట్టాలు చేసుకురావడం విడ్డురం. పక్కవాళ్ళను ఎలా ఆక్రమించుకోవాలి అనేదానిపై ఈ చట్టం తెచ్చిందా చైనా..! అయినా ఎవడి భూములపై,  చట్టాలు చేస్తారు. ఈ చట్టం ద్వారా అయినా భారత్, భూటాన్ లను ఇష్టానికి ఆక్రమించుకోవడానికి చేసినదే తప్ప మరొకటి కాదని విశ్లేషకులు అంటున్నారు. దాదాపుగా చైనా ఉపేక్షించడానికి కూడా పనికిరాని దేశంగా ప్రపంచం దృష్టిలో ఉంది పోనుంది. ఒకవేళ ప్రపంచం ఈ కొత్త చట్టాలపై అభ్యన్తరాలు చెప్తే, చైనా అంతర్గత వ్యవహారాలలో జోక్యం వద్దు అంటూ స్టేట్మెంట్ ఇస్తుంది. మూర్ఖుడికి ఎవరు ఎన్ని చెప్పినా వింటాడా ఏమిటి. ఇది కూడా అంతే.

ఇలాంటివి చేస్తుంది కనుకనే భారత్ ఆ దేశంతో ఇప్పటివరకు చేసిన భారీ వాణిజ్య ఒప్పందాలను ఇక మీదట చేసుకోకుండానే నిర్ణయానికి దాదాపు వచ్చేసింది. గతంలో కూడా లఢక్ లో చేసిన దానికి అనేక చైనా యాప్ లను భారత్ నిషేదించింది. ఇక వాణిజ్యం కూడా వద్దనుకుంటే, చైనాతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టే. అంటే 90 బిలియన్ డాలర్ల పైగా చైనాతో వాణిజ్యం ఇక మీదట ఉండబోదు. భారత్ లోనే ఆయా వస్తు ఉత్పత్తికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కరోనా సహా పలు అంశాలలో చైనా పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా దిగజారిపోయింది. అందుకే రానున్న రెండేళ్లలో భారత్  అవకాశాలను పొందనున్నట్టు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.  

చైనా ఎన్ని గిమ్మిల్కులు చేసినప్పటికీ భారత్ లోని ఒక్క సెంటీమీటర్ కూడా భూభాగాన్ని ఎవరికి ఇచ్చేది లేదని ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. చైనా తన కన్ను పడ్డ ప్రాంతాలను తనవే అంటూ ఇష్టానికి మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరనే సమాచారాన్ని కూడా ఇటీవల అరుణాచలప్రదేశ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: