మూడు సంవ‌త్స‌రాల త‌రువాత నిర్వ‌హిస్తున్న టీఆర్ఎస్ ప్లీన‌రికి ముప్పై మూడు జిల్లాల నుంచి గులాబీ పార్టీ ప్ర‌తినిధులు తరలి వెళ్తున్నారు. పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పాసులు జారీ చేసిన వారిని మాత్రమే పోటీసులు లోప‌లికి అనుమ‌తిస్తున్నారు. పార్టీ స్థాపించి 20 వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా అంగ‌రంగ వైభంగా గులాబీ వేడుక‌ను నిర్వ‌హిస్తున్నారు ఆ పార్టీ నేత‌లు. ఈ ప్లీన‌రికి ఆరు వేల మంది పార్టీ ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందించారు. నూతంగా ఏర్పాట‌యిన పార్టీ సంస్థాగ‌త క‌మిటీ స‌భ్యులు, అలాగే రాష్ట్ర ప్ర‌తినిధులు పాల్గొననున్నారు.

 ఈ ప్లీన‌రి స‌మావేశం రెండు సెష‌న్‌లుగా నిర్వ‌హిస్తున్నారు. పొద్దున 11 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 1 గంటల వ‌ర‌కు మొద‌టి సేష‌న్ ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు రెండో సెష‌న్ ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు భోజ‌న విరామం ఉంటుంది. ప్లీన‌రీలో పాల్గొననున్న పదివేల మందికి భోజన ఏర్పాట్లు చేసింటి టీఆర్ఎస్ పార్టీ. 36 రకాల వంటకాలతో భోజనం సిద్ధం చేసి డైనింగ్ హాల్ కు తరలిస్తున్న వాలంటీర్స్.

హైటెక్స్ లో అత్యంత అధునాతన హంగులతో హైటెక్ టెక్నాలజీతో ఈసారి ప్లీనరీకు ఏర్పాట్లు చేశారు. ప్లీన‌రీ స‌మావేశానికి పాల్గొనే పురుషులు, మ‌హిళ‌లు గులాబీ దుస్తుల‌ను ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్లీన‌రీకి వ‌చ్చే ప్ర‌తినిధుల కోసం దాదాపు 50 ఏక‌రాల్లో పార్కింగ్ స్థ‌లాన్ని కేటాయించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఎక్క‌డిక‌క్క‌డ ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు. అలాగే 1400 మంది పోలీస‌లతో భారీ బందోబ‌స్తును కూడా ఏర్పాటు చేశారు ఉన్న‌తాధికారులు.

  తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత రాష్ట్ర సీఎం కేసీఆర్ ను 10 వ సారి టిఆర్ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గులాబి ప్రతినిధులు. 2018లో నిర్వ‌హించిన‌ 17వ ప్లీనరీ స‌మావేశాన్ని మేడ్చల్ కొంపల్లి లో నిర్వహించారు.  ఈ సారి 18 వ ప్లీనరీ హైదరాబాద్ హెచ్ఐసీసీలో వేడుకగా నిర్వహిస్తున్నారు. గులాబీ రంగు చొక్కాలు ధరించి పురుషులు,  గులాబీ రంగు చీర రవిక ధరించి మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: