ఏపీ రాజకీయాలు ఇప్పుడు అనేక మలుపులు తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ కి వెళ్ళడం తో అసలు ఏపీలో పరిస్థితి ఎలా మారుతుంది అనే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎలా అయినా సరే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్ తో ఢిల్లీ వెళ్ళారు అని వార్తలు వింటున్నాం. రాష్ట్రపతి పాలన కోసం ఆయన లాబియింగ్ చేస్తున్నారు అంటూ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఎవరిని కలుస్తారు అనేది అర్ధం అవ్వడం లేదు.

దాదాపు మూడేళ్ళ తర్వాత ఆయన ఢిల్లీ టూర్ కు వెళ్ళారు. ఇక ఢిల్లీ కి చేరుకున్న టీడీపీ  జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు... పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.  ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో సమావేశం అవుతారు చంద్రబాబు.  ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్న చంద్రబాబు నాయుడు... ఇచీవల టీడీపీ  కార్యాలయం పై జరిగిన దాడులు, టీడీపీ  కార్యకర్తలు, నాయకుల నిర్బంధాలు, వేధింపులు పై సిబిఐ దర్యాప్తు ను కోరే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీ  లో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, డిజిపి తో సహా పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వివరించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపతికి ఒక వినతీ పత్రం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. విజ్ఞాపన పత్రంలో గంజాయ్, హెరాయన్ అంశాలను కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. • ప్రధాని మోడి, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని మీడియా అంటుంది. అయితే వాళ్ళు కలుస్తారా లేదా అనేది తెలియాలి. ఒక బిజెపి రాజ్యసభ ఎంపీ చంద్రబాబుకి ఢిల్లీ లో సహకరిస్తున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: