చైనా చేయంగా సరిహద్దులలో అనుక్షణం గస్తీ భారీగా పెట్టాల్సి వస్తుంది. అలాగే నిత్యం గస్తీకి మానవ వనరులను మాత్రమే కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికతను కూడా వాడేందుకు సిద్ధం అవుతుంది. దీనివలన నిత్యం ప్రతి క్షణం నిఘా ఏర్పాటు చేసినట్టు అవుతుంది. సరిహద్దులలో చొరబాట్లు కాదు కదా, కనీసం చీమ చిటుక్కుమంటే తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇలాంటి సాంకేతికత చైనా, పాక్ సరిహద్దులలో వాడేందుకు సిద్ధం అవుతుంది భారత్. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో మౌలిక  వసతులు వంటివి ఏర్పాటు చేస్తూనే ఉంది. రైళ్లు, రోడ్లు, విమానాశ్రయాలు వంటివి పునరుద్ధరిస్తుంది.

సరిహద్దు వెంబడి మానవ రహిత విమానాలు, డ్రోన్లు, రాడార్లు అమర్చిన హెలికాఫ్టర్లు ఇప్పటికే ఏర్పాటు చేసింది భారత్. అలాగే ఉపగ్రహ చిత్రాలు కూడా ఎప్పటికప్పుడు పరికేస్తూనే ఉంది సైన్యం. ఇవన్నీ చైనా సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి. వీటితో కృత్రిమ మేధస్సు తయారైతే ఆయా చైనా సైన్యం కదలికలు వీడియో లు, చిత్రాల ద్వారా భారత సైన్యం త్వరగా తగిన చర్యలకు ఉపక్రమిస్తుంది. వారి సైన్యం ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏయే ఆయుధాలు వాడుతున్నారు అనేవి స్పస్టముగా తెలుస్తాయి. అలాగే చైనా సరిహద్దులలో ఏమైనా అక్రమ నిర్మాణాలు జరిగినట్టు ఉంటె వాటిని కూడా తెలుసుకుంటుంది. దీనితో చైనా కు భారత్ చెక్ పెట్టగలుగుతుంది.

సాంకేతికత విపరీతంగా పెరిగినందున యుద్దాలు కూడా అదే తరహాలో ఉంటాయన్నది నిపుణుల మాట. అదే తరహాలో అన్ని రంగాలలో ఈ కుత్రిమ మేధాశక్తిని భారత్ వాడేందుకు సిద్ధం అవుతుంది. యుద్ధరంగంలో కూడా ఈ సాంకేతికతతో ఆయుధాలు వాడటం అత్యంత సులభం.  శత్రు భయానకంగా, కనిపించకుండానే ఎంతదూరమైనా ఆయుధ ప్రయోగం చేయవచ్చు. ఈ తరహా ప్రక్రియ భారత్ లో ఇప్పటికే మొదలైంది, మరో నాలుగేళ్లలో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. డీఆర్డిఓ కూడా 150 మంది నిపుణులతో కలిసి ఈ సాంకేతికత ఉపయోగించుకొని ఏఐ రోబోటిక్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నిఘా వ్యవస్థలలో కూడా వీటిని వాడటం ద్వారా శత్రుసమాచారాన్ని కూడా తేలికగా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: