తెలుగుదేశం నుంచి అనేక మంది వెళ్లారు గులాబీ గూటికి.. ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు కాదు ఉద్వేగాలు ఉన్న‌ప్పుడు కాదు.. 2014 త‌రువాత చేరిన వారే వీరంతా! కేవ‌లం తాము అభివృద్ధి కోరి వ‌చ్చామ‌ని రొటీన్ డైలాగులు చెప్పినా ఇవాళ అక్క‌డున్న టీడీపీ నేత‌లంతా ఫ‌క్తు రాజ‌కీయం వంటికి ఎక్కించుకున్న నేత‌లు. ఇంకా చెప్పాలంటే అల‌వ‌ర్చుకున్న నేత‌లు. మ‌రి! ఆ రోజు అమ‌రుల గురించి వీరేమ‌ యినా మాట్లాడారా? ఆ రోజు పోలీసుల అణిచివేత‌ల గురించి వీరేమ‌యినా మాట్లాడారా? అయ్యో! కనీసం ఓయూ కాంపౌండ్ కు పోయి అక్క‌డ ఉద్య‌మ కారుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారా? ఇవ‌న్నీ లేన‌ప్పుడు టీడీపీ నాయ‌కులు టీఆర్ఎస్ నాయ‌కులు సాధించిందేంటి?


ఏదేమైన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ ప్లీన‌రీలో టీడీపీ కోవ‌ర్టులు తెగ హ‌ల్ చేస్తున్నారు. ఆ రోజు ఉద్య‌మంలో లేనివారంతా ఇవాళ వేదిక‌పై క‌నిపించి ఆనందంగా ఉన్నారు. మ‌రి! మోస‌పోయింది ఎవ‌రు ప్ర‌జ‌లే క‌దా! అయినా కూడా టీడీపీ కోవ‌ర్టుల‌కు లోటే లేదు. ఆ రోజు ఎవ్వ‌రూ మాట్లాడ‌క‌పో యినా, టీడీపీ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవ‌డంతో ఇదే స‌మ‌యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత‌లం తా టీఆర్ఎస్ లో చేరిపో యారు. నామా నాగేశ్వ‌రరావు లాంటి నేత‌లు హాయిగా ఉన్నారు. ప‌ద‌వులు అందుకున్నారు. అదేవిధం గా క్యాడ‌ర్ ను బ‌లోపేతం చేసుకున్నారు. మ‌రి! త‌ల్లి లాంటి టీడీపీని వీరు ప‌ట్టించుకున్నారా? ఏం ప‌ట్టించుకుంటారు? ఒక్క నామా నాగేశ్వ‌ర‌రావు అనే కాదు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇంకా ఇంకొంద‌రు ఇవాళ పార్టీ ప‌ద‌వులు అందు కుని హాయిగా ఉన్నారు.

ఇర‌వై ఏళ్ల పార్టీలో ఉద్య‌మాలు ఉన్నాయి. గులాబీ దండు క‌వాతులో ఆ రోజు వీళ్లెవ్వ‌రూ లేరు. అదేవిధంగా టీడీపీలో ప‌ద‌వులు అందుకుని హాయిగా ప‌దవులు అనుభ‌వించి దుర‌దృష్ట‌మో అదృష్ట‌మో తెలంగాణ ఇంటి పార్టీలో చేరిపోయారు. ఇవాళ వేదిక‌పై చాలా మంది టీడీపీ కోవ‌ర్టులు ఉన్నారు. వారినెవ్వ‌రినీ కేసీఆర్ ప్ర‌శ్నించ‌రు కానీ ఇక‌పై వారితో సాగే ప్ర‌యాణం సాఫీగా ఉంటుందా లేదా అన్న‌ది ఓ సందిగ్ధం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: