ఏపీ  సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యకు సంబంధించి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. యూనివర్శిటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ ను రిక్రూట్‌ చేయమని ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాం అని ఆయన వివరించారు. రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదు అని స్పష్టం చేసారు. టీచింగ్‌ స్టాఫ్‌ లో క్వాలిటీ ఉండాలి అని క్వాలిటీ లేకపోతే.. రిక్రూట్‌ చేసినా అర్థం ఉండదు అన్నారు ఆయన. అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి అని తెలిపారు. అత్యంత పారదర్శకంగా నియమాకాలు సాగాలి అని అన్నారు సిఎం వైఎస్ జగన్ .
 
ప్రతి వారం ఒక వీసీని పిలిపించుకుని... యూనివర్శిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చొని చర్చించాలని ఉన్నత విద్యామండలికి సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆ సమావేశంలో గుర్తించినా అంశాలను తన దృష్టికి తీసుకురావాలన్న సీఎం.. ఇలా రాష్ట్రంలోని ప్రతి యూనివర్శిటీ వీసీతో కలిసి విడివిడిగా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఉన్న స్థాయి, మెరుగుపరుచుకోవాల్సిన ప్రమాణాలను గుర్తించాలని సిఎం సూచించారు. తర్వాత యూనివర్శిటీ వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు.

వచ్చే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణ రూపొందించాలన్న సీఎం... మూడేళ్లలో ఈ విజన్ అందుకోవాలని తెలిపారు. అన్నియూనివర్శిటీల్లో నాక్‌రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కావాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్శిటీలతో ఇంటిగ్రేట్‌కావాలి అని ఆయన ఆదేశించారు. ఆన్‌లైన్లో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోర్సులను ఉంచాలని స్పష్టం చేసారు. ఇంగ్లీష్ ను మెరుగుపరచడంపైనా దృష్టిపెట్టాలన్నారు. బేసిక్‌ ఇంగ్లీష్  అన్నది తప్పనిసరిగా సబ్జెక్టుగా పెట్టాలని తెలిపారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

 తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్  మాధ్యంలోకి విద్యార్థులు మారేటప్పుడు వారికి సౌలభ్యంగా ఉండటానికి రెండు భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపొందించాలని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు... రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్ అందించాలని స్పష్టం చేసారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అన్నారు జగన్. ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దు అని తెలిపారు.  ప్రతి కాలేజీలో ప్రమాణాలు పాటించాల్సిందే అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: