ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి నేడు హాట్ కామెంట్స్ చేసారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని అన్నారు ఆయన. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడకాకుండా పత్రిక సమావేశాలకు పరిమితం అయిందని ఇప్పుడు ప్రభుత్వం పై బురదజల్లేందుకే ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి వచ్చిందన్నారు. సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తాం అని వెల్లడించారు.

ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని ఆయన పేర్కొన్నారు. సోమశిల విషయంలో పెండింగ్ లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్ చేస్తాం అని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తుంది అని స్పష్టం చేసారు. బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి  అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు అని స్పష్టం చేసారు.  ప్యారా మిలిటరీ  బలగాలు మొహరింపజేసి హడావుడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మొత్తం ఆర్మీ బలగాలు దించినా మాకు ప్రజాబలం ఉంది అన్నారు ఆయన. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. మీకు ప్రజాబలం లేదనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు చేసారు. ఎన్నికల కమిషన్ ను మేము కూడా అడుగుతున్నాం.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్రం నిలువునా విభజన జరిగిందని మాకు రాజకీయ ప్రయోజనాల కంటేరాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని స్పష్టం చేసారు. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం అని స్పష్టం చేసారు. చట్టంలో ఉన్న హామీలనే అడుగుతున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp