టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో  ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు, విద్యుత్ ప్ర‌తిపాద‌న  ప్ర‌వేశ‌పెట్టి సంక్షేమ రంగంలో అభివృద్ధిపై  తీర్మానం చేశారు.  ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చాం..మున్సిప‌ల్ అవినీతిని నిర్మూలించేలా కొత్త చ‌ట్టం తీసుకొచ్చాం. భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న 95 శాతం పూర్త‌యింది. భ‌ద్ర‌త‌లో తెలంగాణ‌ను నెంబ‌ర్‌వ‌న్‌గా తీర్చిదిద్దాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులే ద‌క్కేలా జోన‌ల్ విధానం తీసుకొచ్చాం. గూగుల్‌కి గుండెకాయ హైద‌రాబాద్ అని..  ఎర్ర‌బ‌స్ నుంచి ఎయిర్ బ‌స్సు వ‌ర‌కు.. యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ వ‌ర‌కు హైద‌రాబాద్ అని న‌గ‌రానికి గొప్ప‌త‌నం గురించి చాటిచెప్పాడు.

దాదాపు న‌గ‌రం చుట్టూ 348 కిలోమీట‌ర్ల దూరంలో రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు వ‌స్తుంద‌ని తెలిపారు.  దీని ద్వారా కొత్త‌గా ఉపాధి అవ‌కాశాలు రాబోతున్నాయ‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌లు అంటే టాటాలు కాదు.. తాత‌ల నుంచి వ‌స్తున్న కుల‌వృత్తుల‌ను కాపాడ‌డం అని , తెలంగాణ ప్ర‌భుత్వం కుల వృత్తుల‌ను కాపాడుతుంద‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేస్తోంద‌న్నారు. ఆగం అవుతున్న తెలంగాణ నేడు ఆద‌ర్శంగా మారింది.  తెలంగాణ‌లో 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ ఇస్తున్నామని,  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదన్నారు.

 దేశంలో అతి స‌క్సెస్ స్టార్ట‌ప్ రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ అని పేర్కొన్నారు.  తెలంగాణ‌లో త్రి ఐ న‌డుస్తోంద‌ని కేంద్రానికి వివ‌రిస్తున్నాం. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన అవినీతిని కొత్త‌చ‌ట్టం ద్వారా క‌డిగిపారేస్తున్నాం. దేశంలో త్రి ఐని అమ‌లు చేస్తే దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంద‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన‌ప్పుడు 7885 మెగావాట్ల విద్యుత్ నుంచి నేడు 16,425 మెగావాట్ల విద్యుత్ చేరుకున్నాం అని ప్ర‌క‌టించారు. దేశంలోని త‌ల‌స‌రి విద్యుత్‌లో తెలంగాణ అగ్ర‌గామిగా ఉంద‌న్నారు. తెలంగాణను వెక్కిరించిన వారే తెలంగాణ‌లో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని కొనియాడుతున్నారు. తెలంగాణ‌కు కంపెనీలు క్యూ క‌డుతున్నాయ‌న్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: