చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని.. అది కూడా ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టి 356 ఆర్టిక‌ల్‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని.. ఆయన డిమాండ్ చేశారు. ఓకే.. చంద్ర‌బాబు చెప్పినవ‌న్నీ ..విన్న రాష్ట్ర‌ప‌తి కోవింద్‌.. చాలా సీరియ‌స్ అయ్యార‌ట‌. నిప్పులు చెరిగార‌ట‌. ఇంత అన్యాయంగా ఉందా? ఏపీలో అంటూ.. ప‌ళ్లు ప‌ట‌ప‌ట‌లాడించార ట‌. అంతు తేల్చాస్తానంటూ.. చంద్ర‌బాబు బృందానికి హామీలు గుప్పించార‌ట‌. సో.. ఇత‌మిత్థంగా.. చంద్ర బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో తొలిరోజు.. భేషుగ్గా స‌క్సెస్ అయింది.

ఇక‌, ఇప్పుడు వెయింట్ ఎందుకు.. వెంట‌నే ఏపీకి వ‌చ్చేద్దామా? అంటే..ఆ ప‌క్క‌నే ఉన్న ప్ర‌ధాన మంత్రి, కేంద్ర హొం మంత్రి అమిత్ షాలను కూడా క‌లిసేసి.. వారి ద‌గ్గ‌ర కూడా హామీలు పొందేసి.. ఏపీలో అడుగు పెట్టాల‌ని.. చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌.. వారికోసం.. వారి అప్పాయింట్ మెంట్ క‌సం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కు వీరి అప్పాయింట్మెంట్లు ద‌క్క‌లేదు. వాస్త‌వానికి ప్ర‌ధాని మోడీ ఇప్పుడు మంచి మూడ్‌లో ఉన్నారు. దేశంలో వంద కోట్ల టీకా పూర్తి అయింది. అదేస‌మ యంలో పెట్రోల్‌పై ధ‌ర‌లు పెంచిన కార‌ణంగా.. ఖ‌జానా క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈ నేప‌థ్యంలో మోడీ హ్యాపీ గానే ఉన్నారు.

ఈ స‌మ‌యంలోనే చంద్ర‌బాబు .. మోడీని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. `మంచి స‌మ‌యం మించిన దొర‌క‌దు!`` అనుకున్న చంద్ర‌బాబు గ‌త రెండు రోజుల నుంచి ప్ర‌ధాని  కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయి తే.. ఆయ‌న మాత్రం బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. రేపో మాపో ఇస్తార‌నే ఆశ‌తో ఢిల్లీలోనే చంద్రబాబు మ‌కాం వేశారు. అయితే.. దీనిపై టీడీపీ నేత‌ల్లోనే ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. ఇక‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయినా.. క‌రుణిస్తాడా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్పుడు ఆయ‌న ఢిల్లీలో లేరు. ప్ర‌స్తుతం జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న సోమ‌వారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకుంటారు. కాబ‌ట్టి మంగ‌ళ‌వారం ఆయ‌న అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అప్పాయింట్‌మెంట్ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ. ఈలోగా.. బీజేపీ పెద్ద‌ల నుంచి ఏదో లేఖ వెళ్లింద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. స‌ద‌రు లేఖ నేప‌థ్యంలో ఆయ‌న బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చే అవ‌కాశం ఉందా? అని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: