ఉప ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్ది హుజురాబాద్లో రాజకీయ వేడి అంతకంతకూ రాజుకుంటుంది. మరికొన్ని రోజుల్లో ప్రచార పర్వం ముగియనుండడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. దాంతో అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధాలు కూడా పెరుగుతున్నాయి. టిఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 57 ఏళ్లకు పెన్షన్,5 వేల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు.

ఇక మరోవైపు బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా  హుజురాబాద్లోనే మకాం వేసి ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా  హోరెత్తిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్  తరపున కూడా  మంత్రి హరీష్ రావు గత కొన్ని రోజులుగా హుజూరాబాదు లోనే ఉంటూ, టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజల్లోకి తీసుకు వెళుతూ వాళ్ల ఓటు బ్యాంకును వారి  వైపు మాలుచుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు మరియు  దళిత బంధు పథకాన్ని కూడా హుజురాబాద్  నుండే ప్రారంభించనున్నారు. మరొకవైపు ఈటల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరియు మంత్రి పదవి కూడా చేపట్టారు. గతంలో అతను చేసిన అభివృద్ధి పనులనే ధ్యేయంగావాటిని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి.ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న ఓటు బ్యాంకును వీళ్లు సాధిస్తారా అనే ఆలోచన కాంగ్రెస్ నేతల్లో వస్తుంది. కాంగ్రెస్ నేతలు ఇంకా అయోమయంలో పడే పరిస్థితి ఉంది.

ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో  అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని  వేగవంతం చేశారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు, బిజెపి తరఫున బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో దానికి దీటుగా హరీష్ రావు సమాధానం చెబుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవడమే లక్ష్యంగా హరీష్ రావు పావులు కదుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా బిజెపి పార్టీ కూడా గతంలో చేసిన అభివృద్ధినిచెప్పుకుంటూ ఈటెల రాజేందర్ ముందుకు పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: