హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో 5 రోజుల్లో ఎన్నిక జరగనుంది. దీని కోసం అన్ని పార్టీలు ఓటర్ల మనసును తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఎందుకంటే ఓటర్ల మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఓటు వేసే వరకు ఎవరికి వేస్తారో ఒక క్లారిటీ ఉండదు. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఎన్నికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ఎంతో ధీమాగా ఉన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవనున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఈ రోజు బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార పార్టీ తెరాస కు సవాల్ విసిరాడు.

ఈ కారణంగా ఈ ఎన్నిక అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈటల రాజేందర్ ఈ ఎన్నికలో గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది. కానీ అలా జరుగుతుందా? తెరాస ముందు బీజేపీ బలపరిచిన ఈటల రాజేందర్ గెలుస్తాడా? అన్నది చూడాల్సి ఉంది. తెరాస ఈ ఎన్నిక కోసం అధికంగా ఖర్చు పెట్టింది. ఏమి జరిగినా ఎన్నికలో విజయమే లక్ష్యంగా పోరాడుతోంది. దళిత బంధు ఎంత వరకు తెరాసకు ప్లస్ అవుతుందో చెప్పలేము. అయితే మొదటి నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు ప్రజల్లో మద్దతు ఉన్నా అది ఎన్నికల్లో విజయానికి కారణం అవుతుందా అన్నది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఈటల రాజేందర్ ఒంటరిగా పోటీ చేసింటే ఫలితం బాగుంటుంది ఏమో తెలియదు.

కానీ బీజేపీ నుండి పోటీ చేస్తుండడం ఒకరకంగా ప్రతికూలం కావొచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న పాలన దేశ ప్రజల్లో ఆవేశాన్ని రగిలిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికలో ఈటల గెలిచినా అది బీజేపీ గొప్పతనం కాదు. ఈటల వ్యక్తిత్వానికి హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవాలి. మరి ఏమి జరగనుంది తెలియాలంటే ఇంకొక వారం రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: