వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం - 6వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా వైఎస్ షర్మిల షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.   సీఎం కెసిఆర్ లాంటి మోసకారి చేతి నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని... తెలంగాణకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నాని ప్రకటించారు వైఎస్‌ షర్మిల.  రాజన్న సంక్షేమ పాలనా తిరిగి తెచ్చుకుందాం, నాకు అండగా నిలవండి... మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లినట్లు కెసిఆర్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల.  

తెలంగాణాలో మహిళల సంక్షేమాన్ని పట్టించుకునే నాధుడే లేడని... అర్హులైన ప్రతిఒక్కరికి పింఛన్ అందాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ షర్మిల. భార్యకు ఇస్తే భర్తకు, భర్తకు ఇస్తే భార్యకు ఇవ్వని పరిస్థితుల్లో మార్పు రావాలని.. .తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే నేను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.  
తెలంగాణ లోనే పెరిగాను, ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నాని.. నాకు ఈ ప్రాంతానికి సేవ చేసే హక్కు నాకు లేదా ? అని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల.  సొంత ఇంటి కల నెరవేరాలంటే వైఎస్సార్ సంక్షేమ పాలనా మళ్ళి రావాలని... కెసిఆర్ పాలనా పోవాలి, వైఎస్సార్ సంక్షేమ పాలనా తేవాలని తెలిపారు వైఎస్‌ షర్మిల.

 
భార్యకు, భర్తకు ఇద్దరికీ పెన్షన్ రావాలంటే వైఎస్సార్ టిపి అధికారంలోకి రావాలని... 5 వేలు ఇస్తూ 15 వేలు పట్టుకుంటున్నారన్నారు.   కెసిఆర్ పాలనాలో రైతులు బాగుపడ్డది లేదు, 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఉద్యమకారుడని అధికారం అప్పగిస్తే ప్రజల సంక్షేమాన్ని పక్కకుపెట్టాడని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల.  మహిళలు తీసుకున్న రుణాలన్నీ ఇంటి అవసరాలకే వాడుకునే దీన పరిస్థి తి వచ్చిందని.. వైఎస్ హయాంలో డ్వాక్రా రుణాలు చెల్లించకుండా మహిళా చనిపోతే ప్రభుత్వమే కట్టేది, కానీ కెసిఆర్ హయాంలో ఆ చనిపోయిన మహిళా కుటుంబం ముక్కుపిండి వసులు చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: