పాక్ ప్రధానిగా మరోసారి బుద్ధి చూపించుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఒక్క మ్యాచ్ లో భారత్ పై గెలిచినందుకు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఇక ఎందుకు పనికిరాని ఆసియా మార్కెట్ల గురించి, చైనాతో, తాలిబన్ లతో ఉన్న సత్సంబంధాల గురించి ఇక్కడ ఆయన ప్రస్తావించడం అందరికి హాస్యాన్నే తెప్పించింది. అసలు తిండికి లేక అల్లాడుతూ, మీసానికి సంపెంగ నూనె అడిగినట్టుగానే ఉంది పాక్ ప్రధాని యవ్వారం. ఒక్క మ్యాచ్ గెలవగానే ప్రపంచ కప్ గెలిచినంత ఆనందం వ్యక్తం చేస్తూ అవతలివారిని అవమానించినట్టుగా మాట్లాడటం చుస్తే గతంలో ఆయన క్రికెట్ ఆడాడా లేక ఆడినట్టు షో చేశాడో అర్ధం కావడం లేదు. ఆటలో గెలుపోటములు సహజం అని తెలిసి కూడా ఇలా మాట్లాడటం వెనుక ఆయన మనస్తత్వం ఏమితో అర్ధం అవుతూనే ఉంది.

ఇక ఆయన ప్రస్తావించిన ఆసియా మార్కెట్, అది అతిపెద్దదట. అలా అని ఆయన చెప్పుకోవాల్సిందే, అక్కడ ఎవడు కొనేవాడు లేక ఈగలు దోమలు తోలుకుంటున్నారు అని ప్రపంచానికే తెలుసు. పాపం ఆయన ఇంకా చైనా మాదిరి అన్ని కప్పిపెట్టుకుని మాట్లాడుతున్నాడు. మరోవిషయం చైనా గురించి. అది పాక్ ను ఎంత బ్రష్టు పట్టించిందో కూడా ప్రపంచానికి తెలుసు కానీ ఇమ్రాన్ కు ఇంకా తెలియకపోవడం, ఆయన నిజంగా ప్రధానేనా లేక స్టాంప్ మాత్రమేనా అనే అనుమానాలను కలిగిస్తుంది. ఒకపక్క పాక్ లో లేని సంక్షోభం లేదు అయినప్పటికీ ఎంత డాంబికం, చూసేవాళ్ళు నిజం అనుకుంటారో ఏమో!

ఇక ఆఫ్ఘన్ విషయం, ఒకదేశాన్ని కొందరు దుర్మార్గులు నాశనం చేస్తుంటే చూసే పాక్ మనస్తత్వం ఎలాంటిది, అలాంటి పనులే చేయలేని భారత్ ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. అయినా పాక్ ప్రధాని ఈ విధంగా హాస్యాలు ఆడటం ఎంత అమాయకత్వాన్ని నటిస్తుండటం వెనుక కూడా బహుశా చైనా పిచ్చి రాజు ఉండేఉంటాడు. ఆయన చెప్పనిదే ఈయన నోట్లో డైలాగు రాదు కదా. 20ఏళ్ళు పోషించిన తాలిబన్ లు గట్టిగ నడ్డి మీద తన్నినా ఎవడికి చెప్పుకోలేక అల్లాడిపోతున్న ఇమ్రాన్  ఒక్క తెలుపు చూసి ఎంత మురిసిపోతున్నాడో, తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఒక్క సమాధానం ఇవ్వడం చేతకాదు కానీ భారత్ పై గెలిచినట్టే హడావుడి చేస్తున్నాడు. ఇమ్రాను ముందు ని దేశంలో పరిస్థితులు మెరుగుపరిచి, ప్రజల జీవన పరిమాణాలు పెంచమ్మ, తరువాత జోకులు వేసుకుందువు గాని.

మరింత సమాచారం తెలుసుకోండి: