హుజురాబాద్ ఉప ఎన్నిక హై రేంజ్‌లో సాగుతోంది. ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మంత్రులు రంగంలోకి దిగి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వ్యూహాత్మ‌కంగా బీజేపీకి ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెట్టేల ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. బీజేపీకి మ‌ద్ధ‌తిచ్చే వ‌ర్గాల‌ను గుర్తించి వారిని టీఆర్ఎస్ వైపు మ‌ళ్లేలా చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈట‌ల వైపు ఉన్న‌వాళ్లు టీఆర్ఎస్ వైపు తిరిగి ఒక్క‌సారిగా లెక్క‌లు మార్చెస్తున్నారు. ఈట‌ల‌ను ఒంట‌రి వాడిని చేయాల‌ని టీఆర్ఎస్ నేత‌లు శ‌త‌విథాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎక్క‌డైతే బీజేపీకి, ఈట‌ల‌కు బ‌లం ఉందో అక్క‌డ బీజేపీ బ‌లం మీద దెబ్బ‌కొడుతున్నారు.


  దీంతో ఈట‌ల కొంత టెన్ష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న‌ప్ప‌టికీ చివ‌రికి ఏం జరుగుంతోన‌నే ఆందోళ‌న‌లో ఈట‌ల ఉన్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల్లో వెల్ల‌డ‌వుతుంది. ఇక మ‌రో ప‌క్క టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా ఏం జ‌రుగుతుంద‌నేది ఆందోళ‌న‌లోఏ ఉంది. ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌జా మ‌ద్ధ‌తు ఎక్కువ‌గా ఉండ‌డం ఒక కార‌ణం అయితే, అధికార పార్టీ గుర్తును పోలిన సింబ‌ల్‌ను ఆ పార్టీలో టెన్ష‌న్ రేపుతోంది. ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌న్న కేసీఆర్ ఆదేశాల‌తో టీఆర్ఎస్ శ్రేణులు క్షేత్ర స్థాయిలో బీజేపీకి చెక్ పెడుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


 కారు గుర్తును పోలిన ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు బ‌రిలో ఉండ‌డంతో చాలా మంది వృద్ధుల‌యిన ఓట‌ర్లు  కారు గుర్తుకు ఓటు వేయ‌బోయి పోర‌పాటున రోడ్డు రోల‌ర్‌, హెలీకాప్ట‌ర్‌, చ‌పాతీ మేక‌ర్ లాంటి గుర్తుల‌కు ఎక్క‌డా ఓటేస్తారోన‌న్న ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అయితే, ఈ సారి ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా భారీ మెజారిటీ తో గెలిచే అవ‌కాశం లేక‌పోలేద‌ని స‌ర్వేలు సూచిస్తున్న నేప‌థ్యంలో అన్ని పార్టీలు అప్ర‌మ‌త్తంగా ప్ర‌చారం  నిర్వ‌హిస్తున్నాయి. ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు ఎక్క‌డ టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తాయోన‌న్న ఆందోళ‌న పార్టీ వ‌ర్గాల్లో నెల‌కొంటున్నాయి.


   ఇప్ప‌టికే అధికార పార్టీ డ‌బ్బుల వ‌ర‌ద కురిపిస్తోంద‌ని, హుజురాబాద్‌లో మ‌ద్యం ఏరులై పారుతుంద‌ని  బీజేపీ అంటోంది. అలాగే అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్ప‌డుతుందని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మ‌రోప‌క్క కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారంగా ఒప్పందం చేసుకున్నాయ‌ని, అందుకే కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న ప్ర‌చారం కూడా వారిలో ఉన్న ఓట‌మి భ‌య‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు. మొత్తానికి బీజేపీ, టీఆర్ఎస్ నాయ‌కుల్లో ఎన్నిక‌లో ఏం జ‌రుగుతుంద‌నే  టెన్ష‌న్ నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: