క‌డ‌ప జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట‌. పైగా ఎస్సీల్లో ఆపార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో బ‌ద్వేల్‌లో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌నే అంచ‌నాలు ఉన్నాయి. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ‌గానే మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ అధికార పార్టీ ఓవ‌ర్ చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియా లో వినిపిస్తున్నాయి. మ‌రో రెండున్న‌రేళ్ల కోసం జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ.. అదే ప‌నిగా.. దాదాపు 15 మంది మంత్రుల‌ను అక్క‌డ నియ‌మించారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అక్క‌డ వాడుతున్నారు. ఇదే ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

అయితే.. ఇక్క‌డ ధ‌ర్మ సందేహం రావొచ్చు. చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్ట‌మ‌న్న‌ట్టుగా.. చిన్న ఉప ఎన్నికే అయినా.. ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్నా.. ఆ మాత్రం హ‌డావుడి చేయాల్సిందేన‌ని కొంద‌రు అంటున్నారు. అంతేకాదు.. ఇలా చేస్తే.. తప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్న‌వారు కూడా ఉన్నారు. కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం దీనికి వ్య‌తిరేకంగా కామెంట్లు కురుస్తు న్నాయి. ఏంటంటే.. ఇక్క‌డ‌బ‌ద్వేల్ లో వైసీపీని గెలిపించే బాధ్య‌త‌ల‌ను సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించారు. అయితే.. ఈయ‌న వెంట 14 మంది మంత్రులు ఉన్నారు. దీంతో పాల‌న ఎక్క‌డాజ‌ర‌గ‌డం లేదు.

ఆయా శాఖ‌ల‌ను చూడాల్సిన మంత్రులు ప్ర‌స్తుతం బ‌ద్వేల్‌లో తిష్ఠ‌వేయ‌డంతో గ‌డిచిన 15 రోజులుగా ఆయా శాఖ‌ల ప‌నుల‌పై ప్ర‌భావం ప‌డింది. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. ఇదొక కామెంట్ అయితే.. మ‌రో కీల‌క‌మైన పాయింట్ ఉంది. అదేంటంటే.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని.. ఇటీవ‌ల జ‌రిగిన స్తానిక‌.. పంచాయితీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ వైసీపీనే విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ప్ర‌జ‌లు మొత్తంగా త‌మ వెంటే ఉన్నార‌ని కూడా చెబుతోంద‌ని.. మ‌రి అలాంట‌ప్పుడు ఇంత హ‌డావుడి చేయ‌డం ఎందుకు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. దీనిపై పెద్ద‌గా ప్ర‌ధాన మీడియా దృష్టి పెట్ట‌క‌పోయినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం కామెంట్లు ప‌డుతున్నాయి.

ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత‌ పెరుగుతోంద‌ని.. వైసీపీ భావిస్తోందా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం మంత్రుల‌తో పాటు.. 20 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీలు ఇక్క‌డే తిష్ట‌వేసి.. ప్ర‌చారం చేస్తున్నారు. దీనినే సోష‌ల్ మీడియా జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. చిత్రం ఏంటంటే.. ఇక్క‌డ పోటీలో ఉన్న ప్ర‌ధాన పార్టీ వైసీపీనే. బీజేపీ పోటీలో ఉన్నా.. పెద్ద‌గా ప్ర‌చారం చేస్తున్నా.. ఆశించిన ఫ‌లితం రావ‌డం క‌ష్ట‌మే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: