తెలుగుదేశం పార్టీలో ఇప్పుడుప్పుడే మార్పులు వస్తున్నాయి...తాజాగా జరిగిన ఘటనల నేపథ్యంలో నాయకులు దూకుడు పెంచారు. ఎప్పుడైతే వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసులపై దాడికి దిగారో అప్పటినుంచి కాస్త రాజకీయం మారిపోయింది. మొన్నటివరకు కాస్త సైలెంట్‌గా రాజకీయాలు చేసిన నాయకులు..ఇప్పుడు దూకుడుగా రాజకీయాలు మొదలుపెట్టారు. తమదైన శైలిలో పనిచేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే మొదట నుంచి పార్టీలో కీలకంగా ఉన్న పరిటాల ఫ్యామిలీ సైతం దూకుడుగా రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసింది....ఇప్పటికే పరిటాల సునీతమ్మ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమదే సీమరక్తమే అని, తమకు బీపీ పెరుగుతుందని మాట్లాడారు. అలాగే ఎప్పుడూలేని విధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలకు సైతం సునీతమ్మ వార్నింగ్ ఇచ్చేశారు. ఇంతవరకు సునీతమ్మ...కొడాలి, వంశీలపై దూకుడుగా విమర్శలైతే చేయలేదు. మొదటసారి ఆమె కూడా ఫైర్ అయిపోయారు.

అటు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ సైతం అదే తరహాలో ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో దూకుడుగా రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్న శ్రీరామ్...పెద్దగా అక్కడ ఎఫెక్టివ్ గా పనిచేసినట్లు కనిపించలేదు. రాప్తాడులో కాస్త పనిచేసినట్లు కనిపించారు గానీ ధర్మవరంపై పెద్దగా ఫోకస్ చేసినట్లు కనబడలేదు. కానీ తాజాగా ధర్మవరంపై ఫోకస్ చేశారు. అక్కడ ప్రజా సమస్యలపై పోరాటం ఉదృతం చేశారు.

తాజాగా ధర్మవరంలోని మార్కెట్‌ని ఖాళీ చేయించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణాభివృద్ధి పేరుతో 50 ఏళ్ళకు పైనే ఉన్న మార్కెట్‌ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. పైగా దీనికి బదులు టౌన్ చివర శ్మశానం దగ్గర ఒక 25 సెంట్లలో మార్కెట్‌ని పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.

దీన్ని ధర్మవరం టౌన్ ప్రజలు, మార్కెట్ బాధితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికోసం శ్రీరామ్ గట్టిగానే పోరాడుతున్నారు. బాధితులకు అండగా నిలబడ్డారు. ఇక ఇలా పోరాటాలు చేస్తున్న శ్రీరామ్‌కు ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి చెక్ పెట్టగలరో లేదో చూడాలి. ఎందుకంటే కేతిరెడ్డి అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టడం అంత సులువు కాదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: