వైయస్సార్టిపి అధ్యక్షురాలు షర్మిల పై ఒత్తిడి పెరుగుతోందా..? పాదయాత్రపై పునరాలోచన చేయాలన్న ప్రెజర్ వస్తోందా..? షర్మిల యాత్ర ఏపీలో విపక్షనేత చంద్రబాబుకు ఓ మాత్ర కానుందా..? పార్టీ పెట్టి వంద రోజులు అయినా ఏనాడూ స్పందించని కుటుంబ సభ్యులు  ఇప్పుడు షర్మిలను పదే పదే ఎందుకు కలుస్తున్నారు..? ఇంతకీ షర్మిల పాదయాత్రలో వై వి సుబ్బారెడ్డి ఎందుకు కలిశారు. వారి మధ్య జరిగిన ఏకాంత భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి..? ఏపీ వైసీపీలో కీలక నేతగా వున్న వైవి సుబ్బారెడ్డి షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

షర్మిలతో సుబ్బారెడ్డి ఏ విషయమై చర్చించారని రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న చర్చ. కుటుంబ పెద్దగా వచ్చారా కుటుంబ సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకున్నారా..? ఇటీవల ఏపీ రాజకీయాలపై విజయమ్మ మాట్లాడకపోవడం చర్చకు వచ్చిందా. రెండు రోజుల కింద చంద్రబాబు నోట షర్మిల యాత్ర మాట నేపథ్యంలో వై వి సుబ్బారెడ్డి షర్మిలను ఓదార్చేందుకు వచ్చారా..? అసలు యాత్ర వద్దన్నారా అంటూ  రకరకాల చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ పార్టీ పెట్టిన షర్మిల టిఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె పాదయాత్రలో వైసీపీ నాయకుడు దర్శనమివ్వడం ఆసక్తి రేపుతోంది నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి షర్మిలను మీట్ అయ్యారు. సుమారు గంటపాటు మాట్లాడుకున్నారు. దీంతో తాజ రాజకీయ పరిణామాలకు ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ పెట్టిన సమయంలోనే షర్మిల తాను పార్టీ పెట్టడం అన్న జగన్ కి ఇష్టం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఇద్దరికీ బాబాయి అయినా వై వి సుబ్బారెడ్డి షర్మిల ను కలవడం ఏంటి అని రాజకీయవర్గాలకు అర్థం కాని ప్రశ్నగా  ఉంది. సుబ్బారెడ్డి కేవలం చిన్నాన్న మాత్రమే కాదు  జగన్ కు ఆంతరంగికుడు కూడా. సుబ్బారెడ్డి చెప్పాడంటే జగన్ చెప్పినట్టే అన్నది పార్టీలో అందరూ చెప్పే మాట. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి షర్మిల ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మధ్య జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయంటున్నారు కొందరు పార్టీ నేతలు.

జగన్మోహన్ రెడ్డిని షర్మిల యాత్రను  ఉద్దేశించి టిడిపి నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా కలకలం రేపాయి. షర్మిల యాత్ర ఏపీ విపక్షానికి అస్త్రంగా మారే అవకాశం ఉందని మరోసారి పునరాలోచించాలని బాబాయ్ వై వి సుబ్బారెడ్డి కోరారట. పాదయాత్రను రద్దు చేసుకోవాలని అడిగారట. అందుకు షర్మిల సింపుల్ గానే చెప్పారట. ఇంత వరకు వచ్చాక వెనకడుగు వద్దు బాబాయ్ అని చెబుతూనే కుటుంబ సమస్యలు చర్చించారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: