రష్యా తాలిబన్ ల చేత బాధించ బడిన మొదటి దేశం. తాలిబన్ లను దెబ్బతీయాలని అప్పట్లో ఆఫ్ఘన్ లోకి వచ్చిన రష్యా తోకముడిచి పోవాల్సి వచ్చింది. అందుకే యూఎస్ఎస్ఆర్ గా ఉన్నది కాస్తా రష్యా గా ముక్కలు అయిపోయింది. అయినా తాజాగా తాలిబన్ లతో చేతులు కలిపింది, ఆఫ్ఘన్ ను ఆక్రమించడంలో ప్రధాన పాత్ర పోషించింది. చైనా, పాక్ లు కూడా అందుకు సహకరించిన విషయం విదితమే. మరోపక్క సరిహద్దులలో ఉన్న తుర్కమిస్తాన్ లతో యుద్ధ విన్యాసాలు చేస్తుంది. ఎందుకు అని అంతర్జాతీయ మీడియా అడిగితే ఐఎస్ నుండి రక్షణ కోసం అంటూ చెప్పుకొస్తుంది. తాలిబన్ ల నిధులను కూడా విడుదల చేయాలని అమెరికా ను అడుగుతుంది రష్యా. ఇక తాలిబన్ లను కూడా తీవ్రవాదులుగా గుర్తించరాదనే వారి నిబంధనను కూడా దాదాపు రష్యా ఒప్పుకుంది.

ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలను ముప్పుతిప్పలు పెట్టిన తాలిబన్ లు కూడా ఇంకా తమకు అడ్డు ఎవరు వస్తారు అంటూ ఇష్టానికి ప్రవర్తిస్తుండటం రోజు చూస్తూనే ఉన్నాం. అలాగే తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగంగా ఉన్న హక్కానీ తీవ్రవాది పై ప్రపంచవ్యాప్తంగా కేసులు, పట్టించిన వారికి భారీ బహుమతులు కూడా ప్రకటించి ఉన్నాయి. అయినా వారిని తీవ్రవాదులు కాదనే విధంగా తమపై ఉన్న నిషేధాలు ఎత్తివేయాలని తాలిబన్ డిమాండ్ కూడా రష్యా ఒప్పుకున్నట్టే ఉంది. గతంలో దెబ్బలను బహుశా రష్యా మరచిపోలేక, ఇప్పుడు తాలిబన్ లు ఏమి చెబితే అది చేస్తుందేమో అంటున్నారు విశ్లేషకులు.

కానీ రష్యా చేసేది, చేయమంటున్నది మాత్రం ప్రపంచం ముందు తీవ్రవాదులను శాంత మూర్తులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నట్టే ఉంది. అలాంటివి ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. తాలిబన్ లు రష్యా ను, అమెరికాను అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఘటికులే అనడం సరికాదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ తరహా వ్యవహారం నడుస్తుంది తప్ప ఆ రెండు దేశాలు ఇలాంటి వారికి బయపడేవి కాదు, అలాగని వాళ్ళు చెప్పినట్టు వినే అలవాటు వాళ్లకు అసలే లేదు. మేము గొప్పవాళ్ళం అన్నవాళ్ళు నేడు ఒదిగి ఉన్నారంటే, కేవలం ఆయుధాల అమ్మకాల కోసం అయినా అయిఉండాలి లేదా ఏదైనా పెద్ద వ్యూహం వేసైనా ఉండాలి అనేది తాలిబన్ లు గ్రహించాల్సి ఉంటుంది. లేదంటే కుక్కచావు తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: