భారతదేశం తన సరిహద్దులలో ఉన్న ఏ దేశానికైనా  ఎదో ఒక సమయంలో సాయం అందిస్తూనే ఉంది. కానీ వాటితోనే అనుక్షణం ఇబ్బంది పడుతూనే ఉంది. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్గనిస్తాన్ తదితర చిన్న చిన్న దేశాలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. కానీ అవి మాత్రం భారత్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కానీ ఆయా ఇబ్బందులు వాళ్ళు స్వయంగా పెడుతున్నవి కాదని భారత్ అర్ధం చేసుకుంటుంది. గతంలో నేపాల్ తో కూడా భారత్ కు సత్సంబంధాలు ఉండేవి, ఇప్పటికి అలాగే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని అపార్దాలు మాత్రం నేపాల్ వైపు నుండి తప్పడం లేదు. గతంలో ఇదే నేపాల్, చైనాను అడ్డుపెట్టుకొని హిమాలయాల ప్రాంతాన్ని ఆక్రమిచ్చేందుకు ప్రయత్నించింది. అది చైనా దగ్గరుండి చేసింది అని భారత్ కు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. నేపాల్ పై కూడా విరుచుకుపడటం లాంటివి ఏమి చేయలేదు భారత్.

తాజాగా కూడా నేపాల్ భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది అంటే అందుకు కారణం భారత్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి అనేది అందరికి తెలిసిందే. ఇలాంటి పనులు చేయడం వలన ఎదుటివారు తమ బుద్దిని బయటపెట్టుకున్నట్టు అవుతుంది తప్ప భారత్ కు పోయేది ఏమి లేదు. ఇక భారత్ కూడా నేపాల్ కు మరో నజరానా ఇచ్చేసింది. బీహార్ జయనగర్ నుండి నేపాల్ లోని కుర్తాళ్ వరకు ఉన్న34.9 కి.మీ. క్రాస్ బోర్డుర్ రైల్వే లింక్ ని బహుమతిగా ఇచ్చింది. దాని నిర్వహణ మాత్రం భారత్ చూస్తుంది. వాళ్లకు అక్కడ సమస్యలు వస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్వహణ కూడా వారికే ఇచ్చేసింది భారత్. ఇది మిత్ర లేదా పొరుగు దేశాలకు భారత్ ఇచ్చే విలువ.

ఇవన్నీ చూస్తూ, ప్రపంచం ముందు చైనా ఎటువంటిది, భారత్ ఎటువంటిది అనేది తెలుసుకోకపోతే ఇంకెందుకు అంతర్జాతీయ సంస్థలు. ఆ మాత్రం ఎవరు ఎటువంటి వారో తెలియకుండా ఎంతసేపు వ్యాపారం అని పడిచస్తే, నేడు ఆ వ్యాపారాలు కూడా చేసుకోడానికి పనికిరాని రోగం అందరిని పట్టి పీడిస్తుంటే ఏమి చేయగలుగుతున్నారు. అది తెలుసుకొని ఎవరికి విలువ ఎంత ఇవ్వాలనేది ఆయా దేశాలు నిర్ణయించుకుంటే రానున్న రోజులు సజావుగా ఉండటానికి వీలుంటుంది. లేదంటే, ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటె వాడే పెత్తనం అంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: