తెలంగాణ ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో టీఆర్ఎస్ ను పెట్టాలని తనపై వత్తిడి వస్తుందని,  తెలంగాణ లో అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలు చూసి ఏపీ ప్ర‌జ‌లు కూడా త‌మ పార్టీని అక్క‌డ పెట్టాల‌ని కోరు కుంటున్నార‌ని చెప్పారు. పోరుగు తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో ఉన్న తన అభిమానులు ఉన్నార‌ని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ నిజంగా ఇప్పుడు ఏపీ లో పార్టీ పెడ‌తారా ?  లేదా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు కేడ‌ర్ లో జోష్ నింపేందుకే చేశార‌ని తెలుస్తోంది.

అయితే గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు మంత్రి కేటీఆర్ సైతం త‌మ పార్టీ ఆంధ్రా స‌రిహ‌ద్దుల్లో ఉన్న జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ లాంటి చోట్ల పోటీ చేస్తే సులువుగా గెలుస్తుంద‌ని.. అక్క‌డ కూడా త‌మ పార్టీ అభిమానులు భారీగా ఉన్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు తెలంగాణ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టు కోవ‌డం తో గత ఎన్నికల్లో ఏపీలో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ పరోక్ష సహకారం చేశారన్న‌ది ఓపెన్ టాక్ ?

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక కొద్ది రోజులు బాగానే ఉన్నా త‌ర్వాత కేసీఆర్ - జ‌గ‌న్ మ‌ధ్య తేడా కొట్టేసింది. ఇద్ద‌రికి ప‌లు అంశాల్లో చెడింది. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ ను ఇరికించేందుకే కేసీఆర్ ద‌ళిత బంధు అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చి ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. ద‌ళిత బంధును ఏపీలోనూ అమ‌లు చేయాల‌ని కొంద‌రు కోరుతున్నార‌ని అన‌డం వెన‌క పై న చెప్పిన ఉద్దేశ‌మే ఉంద‌ని అంటున్నారు.

అలాగ‌ని కేసీఆర్ చంద్ర‌బాబును ఎలాగూ న‌మ్మ‌రు. అయితే జ‌గ‌న్ తెలంగాణ విష‌యంలో దూకుడుగా ఉండ‌డంతో ఆ దూకుడ‌ను కంట్రోల్ చేసేందుకు ఇలా అని ఉంటార‌న్న గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: