దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ .రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా ఇప్పుడు పాద‌యాత్ర చేస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక ష‌ర్మిల ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా లోని పాలేరు నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. వైఎస్ .రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల  గెలుస్తారా ?  లేదా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఇప్పుడు కేసీఆర్ వ్య‌తిరేక ఓటు చీలుస్తారా ?  లేదా కేసీఆర్ వ్య‌తిరేకంగా ఒక్క‌టి అవుతోన్న రెడ్ల ఓట్లు రేవంత్ రెడ్డి వైపు మ‌ర‌ల్చ కుండా కొంత చీల్చి కేసీఆర్ కు ప్ల‌స్ అవుతారా ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు.

ష‌ర్మిల మాత్రం అన్న‌ జగన్ కు ఇష్టంలేకుండా తెలంగాణాలో పార్టీ పెట్టారన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక గ‌త కొంత కాలంగా అన్నా చెల్లెల్లు అయిన వైఎస్ షర్మిలకు, వైఎస్ జగన్ కు మధ్య మాటల్లేవు అని జ‌రుగుతున్న ప‌రిణామాలే చెపుతున్నాయి. ఇక ఏపీ ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న‌ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తమకు షర్మిల పార్టీతో సంబంధం లేదని చెప్ప‌డంతో పాటు తెలంగాణలో త‌మ పార్టీ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

ఇక త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఎలాగూ త‌న కుమార్తె కే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇప్పుడు బాబాయ్ వైవి . సుబ్బారెడ్డి కూడా ష‌ర్మిల‌ను క‌ల‌వ‌డం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. సుబ్బారెడ్డి ష‌ర్మిల‌ను ఎందుకు క‌లిశారు ? ఆయ‌న ష‌ర్మిల‌ను క‌లిశారు అంటే జ‌గ‌న్ అనుమ‌తి త‌ప్ప‌కుండా ఉండే ఉంటుంద‌ని అంటున్నారు. జ‌గ‌న్ కూడా ష‌ర్మిల‌తో వైరం ఎక్కువ కాలం కొన‌సాగించ‌డం ఇష్టం లేకే.. ఆమె కు తెలంగాణ లో సపోర్ట్ చేసే క్ర‌మంలోనే సుబ్బారెడ్డిని పంపించి ఉంటార‌ని మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: