సీన్ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయింది. ఇష్టం వ‌చ్చిన రీతిన టీడీపీ మాట్లాడినా, వైసీపీ దాడులు చేసినా లేదా చేయించినా ఇవ‌న్నీ ఇప్పుడు పెను దుమారానికే కార‌ణం అయ్యాయి. ఢిల్లీ కేంద్రంగా మాట్లాడాల్సినంత మాట్లాడి జ‌గ‌న్ క‌న్నా ఎక్కువ మార్కులు కొట్టేయాల‌ని బాబు ఉంటే, జ‌గ‌న్ మాత్రం టీడీపీ గుర్తింపునే ర‌ద్దు చేయాల‌ని ప‌ట్టుప‌డుతున్నారు. అయితే జ‌గ‌న్ మ‌నుషులు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డాన్నే తీవ్ర నేరంగా ప‌రిగ‌ణిస్తున్నారు వైసీపీ వ‌ర్గీయులు.

ఢిల్లీ కేంద్రంగా బాబు రాజ‌కీయం న‌డుపుతున్నారు. త‌మ రాష్ట్ర కార్యాల‌యంపై జ‌గ‌న్ మ‌నుషులు దాడి చేయ‌డాన్ని నిర‌సిస్తూ, నిర‌వ‌ధికంగా  మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా మాట్లాడ‌డంతో ఆయ‌న దేశ రాజ‌కీయాల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నా రు. ఆక‌ర్షించాల‌ని చూస్తున్నారు. దీని వ‌ల్ల వ‌చ్చే త‌క్ష‌ణం లాభం క‌న్నా పొందే సానుభూతే ఎక్కువ. సానుభూతి రాజ‌కీయాల‌కు అడ్డాగా ఇప్పుడు ఢిల్లీ ఉంది. లేదా ఉండి ఉంటుంది. చంద్ర‌బాబు త‌న దైన శైలిలో దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయాల‌న్న కోరిక‌ను కూడా బ‌య‌ట‌పెడుతున్నారు. కానీ ఆ కోరిక నెర‌వేర‌డం లేదు. ఆ కోరిక ఎప్ప‌టికప్పుడు వాయిదా ప‌డుతూనే ఉంది. ఆ కోరిక కార‌ణంగానే ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు డైల‌మాలో ఉండిపోతున్నారు. చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇలా ఉంటే జ‌గ‌న్ ప‌రిస్థితి మ‌రోలా ఉంది.

త‌న అభిమానులెవ్వ‌రో త‌న‌ను తిడితే సహించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే రాష్ట్ర టీడీపీ కార్యాల‌యంపై దాడి జ‌రిగింద‌ని, ఇంత‌కు మించి మ‌రో ఉద్దేశం లేద‌ని చెప్పి జ‌గ‌న్ బుక్క‌య్యాడు. ఇదే మాట కేంద్రానికి చేసిన ఫిర్యాదులో కూడా టీడీపీ పొందు ప‌రిచే ఉంటుంది. త‌న‌కూ దాడి ఘ‌ట‌న‌కూ అస్స‌లు సంబంధ‌మే లేద‌ని అంటున్నారు జ‌గ‌న్. ఇదే ఇప్పుడు బీజేపీని పున‌రాలోచ‌న‌లో ప‌డేస్తోంది. రేప‌టి వేళ త‌మ కార్యాల‌యాల‌పై కూడా ఇలాంటి దాడులే జ‌ర‌గ‌వ‌ని ఏంటి గ్యారంటీ అని ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ అభిమానులు చేసిన దాడుల‌ను అంతా తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తారు. దూష‌ణ అన్న‌ది రాజ‌కీయంలో చాలా చిన్న విష‌యం. ఎందుకంటే ఆ రోజు జ‌గ‌న్ కూడా అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడ్ని ఉద్దేశించి ఎన్నో మాట‌లు అన్నారు. అన‌రాని మాట‌ల‌నే అన్నారు. అప్పుడు జ‌గ‌న్ ను కూడా జైల్లో పెట్టించాలి క‌దా! కానీ టీడీపీ ఆ ప‌ని చేయ‌లేదు. పాద‌యాత్ర సాఫీగా సాగిపోయేందుకు ఎంత‌గానో స‌హ‌క‌రించింది. ఓ ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి ఇప్పుడు ప‌ట్టాభి మాట్లాడ‌డం ఎంత త‌ప్పో ఆ వేళ జ‌గ‌న్ మాట్లాడిన మాట‌లూ అంతే త‌ప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి: