తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి ఏపీలో ఎంత మంది స్నేహితులు.. అభిమానులు ఉన్నారు. మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు కేసీఆర్ రాజ‌కీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే కేసీఆర్ ది దాదాపుగా 20 ఏళ్ల అనుబంధం. అందుకే ఆయ‌న త‌ర‌చూ ఏపీ అంశాల గురించి కూడా ప్ర‌స్తావిస్తూ ఉంటారు. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి 20 ఏళ్లు అయిన సంద‌ర్భంగా పార్టీ ప్లీన‌రి జ‌రిగింది. ఈ స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని ఏపీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో త‌మ పార్టీ పెడితే చాలు.. గెలిపిస్తామ‌ని అక్క‌డ నుంచి పెద్ద ఎత్తున విన్న‌పాలు వ‌స్తున్నాయ‌న్నారు. ఏపీలో క‌రెంటు కోత‌లు తీవ్రంగా ఉంటే.. తెలంగాణ‌లో క‌రెంటు కు లోటు లేద‌ని చెప్పారు. ఇక ఇక్క‌డ అమ‌లు జ‌రుగుతోన్న సంక్షేమ ప‌థ‌కాలు చూసిన ఏపీ వారు అక్క‌డ కూడా త‌మ పార్టీని పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని కోరుతున్నార‌ని చెప్పారు. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ వాళ్లు పెద్ద‌గా స్పందించ లేదు అనుకుంటోన్న టైంలో ఇప్పుడు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు.

ఏపీలో కేవ‌లం బొగ్గు స‌మ‌స్య మాత్ర‌మే ఉంద‌ని.. ఇక్క‌డ క‌రెంటు కోత‌లు లేవ‌ని అన్నారు. ఇక బొగ్గు స‌మ‌స్య దేశ వ్యాప్తంగా ఉంద‌న్న అనిల్ తెలంగాణతో పోలిస్తే.. ఏపీలోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలవుతున్నాయ‌న్న‌ది నిజం కాదా ? అని కేసీఆర్ ను ప‌రోక్షంగా ప్ర‌శ్నించారు. హుజూరా బాద్ ఉప ఎన్నిక ల నేప‌థ్యంలోనే కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉండ‌వ‌చ్చ‌ని అన్నారు.

ఇక తెలంగాణ లో ఇప్పుడు ఉన్న ప‌థ‌కాల కంటే ఏపీలోనే ఎక్కువ పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు. ఇక కావాలంటే ఏపీలో టీఆర్ ఎస్ పెట్టుకోవ‌చ్చ‌ని.. త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని. తాము స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని అనిల్ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: