ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని  గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులు గా నియమించడంపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జ‌రిగింది. విచార‌ణ‌లో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎలా మంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఈ పిటీష‌న్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


రెవెన్యూ శాఖ‌ లో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్య‌క్తం చేశారు. పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా అప్ప‌గిస్తారో చెప్పాలని ప్ర‌భుత్వానికి  హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.  కార్య‌ద‌ర్శుల‌కు పోలీసు విధులు అప్ప‌గించ‌డం 1859 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్  విరుద్ధం అని న్యాయవాది బాలాజీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సివిల్ వివాదాలను పరిష్కరించవచ్చని ప్ర‌భుత్వం  పేర్కొనడంపై అభ్యంతరం వ్య‌క్తం చేశారు.


  సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టు  తీర్పు ఇచ్చింద‌ని, ఈ విధంగా కార్య‌ద‌ర్శుల‌కు పోలీసు బాధ్య‌త‌లు అప్ప‌గించి సివిల్ వివాదాల్లో భాగ‌స్వామ్యం చేయ‌డం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పున‌కు ఇది విరుద్ధం అని పిటీష‌న‌ర్ త‌ర‌ఫు  న్యాయవాది ఎలా మంజుల బాలాజీ  ఆక్షేప‌న‌లు తెలిపారు. వాద‌న‌లు విన్న హైకోర్ఉ వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు   ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌తివాదులు దాఖ‌లు చేసిన కౌంట‌ర్ ను  పరిశీలించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని  ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామ స‌చివాల‌యాల్లో మ‌హిళా కార్య‌ద‌ర్శుల‌ను పోలీసులుగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో  హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. పిటీష‌న్‌పై నేడు హైకోర్టు విచార‌ణ జ‌రిగింది.  విచార‌ణ అనంత‌రం ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేసిన త‌రువాత దానిని ప‌రిశీలించి ఉత్త‌ర్వులు జార‌తీ చేస్తామ‌ని ఆంద్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తెలిపింది.
   

మరింత సమాచారం తెలుసుకోండి: