కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేసారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ 1 నుంచి మొదలై 2022 మార్చి 31న ముగుస్తుంది అని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ మీ అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రాణాధారం అని దేశంలో యువత తమ గొంతు వినిపించాలని ఎదురుచూస్తున్నారు అన్నారు ఆమె. వారికి ఒక వేదికను అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని పేర్కొన్నారు.

కొన్ని తరాలుగా మనం ఈ పని చేస్తున్నాం అని ఆమె తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డుకు చేరేలా సభ్యత్వ నమోదు పత్రాలను సిద్ధం చేసి, పంపిణీ చేయాలి అని ఆదేశించారు. ప్రతి గడపకూ వెళ్లి సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలి అని స్పష్టం చేసారు. అలాగే కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు చాలా అవసరం అన్నారు ఆమె. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, భావజాలాన్ని విస్తృతపర్చడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉండాలి అని సూచించారు. బీజేపీ-ఆరెస్సేస్ సైద్ధాంతిక ప్రచారంపై మనం పోరాడాలి అని పేర్కొన్నారు.

వారి అవాస్తవాలను బయటపెట్టి, ఈ యుద్ధంలో గెలవాలి అని ఆమె కోరారు. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రకటనలు చాలా కీలకం. అయితే ఇవి క్షేత్రస్థాయి వరకు చేరడం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. అలాగే విధానపరంగా రాష్ట్రస్థాయి నేతల మధ్య స్పష్టత లోపించింది అని బీజేపీ-ఆరెస్సెస్ భావజాలాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేయాలి అని ఆమె సూచించారు. వారికి తగిన శిక్షణనివ్వాలి అని ఆదేశించారు. అన్యాయం, అసమానతలపై పార్టీ పోరాడాలి అని  క్షేత్రస్థాయిలో పోరాటాలు, ఆందోళనలు చేపట్టాలి అని ఆదేశించారు. మోదీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది అని మండిపడ్డారు.  తద్వారా జవాబుదారీతనం లేకుండా చేయాలని చూస్తోంది అని అన్నారు సోనియా. ప్రజాస్వామ్య మూలాలను, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోంది అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: