- అక్రమాలకు అడ్డాగా విశాఖ బీ కాలనీ

- కృష్ణా పాన్ షాప్ ను తొలగించాల్సిందిగా
స్థానికుల పోరు

- పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేయాలి

- కాలనీ వాసుల డిమాండ్

- రూరల్  ఎస్సై దృష్టికి సమస్య

 
శ్రీకాకుళం : మన చుట్టూ ఉన్న సమస్యలపై మనం మాట్లాడం.. కనీసం అడగం కూడా! ప్రశ్నించడం చేతగాదు సరే కనీసం ఫిర్యాదు ఇవ్వడం అయిన చేతగావాలి కదా! ఇప్పుడిదే స్థానిక విశాఖ బీ కాలనీ కేంద్రంగా నడుస్తున్న చర్చ. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కృష్ణా పాన్ షాప్ ను తొలగించాలని, పోకిరీలు ఆగడాలను నియంత్రించాలని, మందుబాబుల అనుచిత ప్రవర్తనను నియంత్రించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కానీ ఓ సీఐ మాత్రం ఇంత తెలిసినా ఇంతవరకూ స్పందించడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

శ్రీకాకుళం : స్థానిక విశాఖ బీ కాలనీలో కృష్ణా పాన్ షాన్ అనేక అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ షాపు యజమాని పొట్నూరు కృష్ణ ప్రవ ర్తనకు సంబంధించి పూర్తి వివరం ఓ సీఐకు అంతా తెలుసు. ఆయనే ఇక్కడ అద్దెకు ఉండేవారు. అప్పట్లో కూడా ఇక్కడ మద్యం అ మ్మకాలు సాగేవి. ఇప్పుడూ యథేచ్ఛగా సాగుతున్నాయి. అదేవిధంగా మహిళలపై అసభ్య ప్రవర్తన, చిన్నారులకు లైంగిక వేధిం పులు అన్నవి ఆ పాన్ షాపు నిర్వాహకుడు చేసేవాడు. చేస్తున్నాడు. వీటిపై కూడా సీఐ కు సమాచారం ఉన్నా  కూడా పెద్దగా ప ట్టించుకోలేదు అన్న అభియోగాలు ఉన్నాయి. ఎక్కడో చిన్నారి చైత్ర కు సంబంధించిన ఘటనలపై మనం స్పందించడం కాదు ఇక్కడ మన చుట్టూ నలిగిపోతున్న, కామాంధులకు బలైపోతున్న చిన్నారుల విషయమై తల్లిదండ్రు లు అప్రమత్తం కావాలి. ఈ దిశగా పోలీసులు చర్య తీసుకోవాలని కోరుతూ స్థానికుడు, జర్నలిస్టు రత్నకిశోర్ శంభుమహంతి రూరల్ ఎస్సై ను సంప్రదించారు. అదేవిధంగా సోమవారం రాత్రి స్టేషన్ కు పోయి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ సమయంలో స్టేషన్ లో ఎస్సై లేకపోవడంతో రైటర్ కు కంప్లైట్ ఇచ్చి, ఆ ఫిర్యాదు కాపీని వాట్సాప్ ద్వారా పంపించమని రైటర్ రవిని ఒప్పించారు. ఆయన వెంటనే ఎస్సై కు ఫిర్యాదు కాపీని వాట్సాప్ ద్వారా పంపారు. ఇక రూరల్ ఎస్సై ఏ విధంగా స్పందించనున్నారో అన్నది వేచి చూడాలి. ఇదే సమస్యపై గ్రామ సచివాలయం మహిళా పోలీసుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ షాపును ఇక్కడి నుంచి తొలగించాలని, పోకిరీ లకు, కొంతమంది పనిపాటా లేని కుర్రాళ్లకు ఈ ప్రాంతం అడ్డాగా మారిపోతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఇక్కడ రాత్రి పది గంటలు దాటిన తరువాత కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కొన్ని సార్లు వీధి దీపాలు సరిగా వెలగక పోవడంతో పొగరాయుళ్లు, మద్యంబాబులు రెచ్చిపోతున్నారు. ఇక్కడే నాలుగు లేడీస్ హాస్టళ్లు ఉండడంతో అమ్మాయి లతో మాట్లాడేందుకు ఎక్కడెక్కడి నుంచో కుర్రాళ్లు వచ్చి వాలిపోతున్నారు. కాలనీలో ఇంత జరగుతున్నా పోలీసులకు ఎందుకు పట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయం అధికారుల దగ్గర కొంత సమాచారం ఉంది. కనుక పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని సత్వర న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: