మ‌నం పొద్దున లేస్తునే పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు పెరిగాయని వింటూనే ఉంటున్నాం. ప్ర‌తి రోజు పెరుగుతూనే వ‌స్తున్నాయి పెట్రోల్‌, డీజిల్ రేట్లు. ఎప్పుడో 5పైస‌లు, 10 పైస‌లు త‌గ్గిన వార్త‌లు కూడా ఎప్పుడో ఒకసారి క‌నిపిస్తోంది. చినుకు చినుకు గాలివాన అయిన‌ట్టు 30 పైస‌లు, 35 పైస‌లు పెరిగింద‌నుకున్నా అది చాలా ప్ర‌భావం చూపెడుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ఇది ఆగిపోతుంది. త‌రువాత మ‌ళ్లీ య‌థాత‌థంగా పెరుగుతూనే ఉంటుంది.


    ఇన్ని రోజులు ఎంత పెరిగిందో లెక్క‌లేకుండా పోతుంది. మే 2020 నుంచి అక్టోబ‌ర్ 2021 మ‌ధ్య‌కాలంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎంత పెరిగాయో చూస్తే.. ప్ర‌పంచ, భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇప్పుడు పెరిగినంత రేట్లు ఎప్పుడు కూడా పెర‌గ‌లేవ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 18 నెల‌ల కాలంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర దాదాపు 36 రూపాయ‌లు పెరిగింది. అలాగే లీట‌ర్ డీజీల్ ధ‌ర దాదాపు 27 రూపాయ‌లు పెరిగింది. అయితే, ఇంత భారీగా ధ‌ర‌లు ప‌న్నులు పెంచిన కేంద్రం ఏం చెబుతుందంటే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో  ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల దేశంలో పెట్ర‌ల్‌, ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతోంద‌ని చెబుతోంది.


 కానీ, 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్యారెల్ ధ‌ర త‌గ్గుతూ వ‌స్తుంద‌ని, కానీ కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌న్నులు పెంచుతూ రావ‌డం వ‌ల్ల‌నే దేశంలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. ఇది 18 నెల‌లుగా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడొచ్చు. న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు లీట‌ర్ పెట్రోల్ పై 9.48 పైస‌లుగా కేంద్ర ఎక్సైజ్ సుంకం ఉండేది. కానీ ఇప్పుడు లీట‌ర్ పెట్రోల్‌పై దాదాపు రూ.32 ఎక్సైజ్ సుంకంగా ఉంది. అంటే ఏ స్థాయిలో పెట్రోల్ రేట్లు పెరిగాయో మ‌నం చూడొచ్చు. అలాగే డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం 2014లో రూ.3 గా ఉండేది ఇప్పుడు రూ.31 కు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: