ప్రపంచవ్యాప్తంగా కరోనా బిన్నంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికి కొన్ని దేశాలలో ప్రభావం తగ్గుతుండగా, అదే సమయంలో మరికొన్ని దేశాలలో మాత్రం విజృంభిస్తుంది కరోనా. దీనితో ఆయా దేశాలలో మళ్ళీ లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలు అవుతున్నాయి. తాజాగా రష్యా, బ్రిటన్, చైనాలు ఈ తరహా పరిస్థితిని చవిచూస్తున్నాయి. అందుకే చైనా పిల్లలకు టీకాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. అందుకు ప్రాంతీయంగా తయారుచేసిన సినోఫామ్, సినోవాక్ లను ఆ దేశం వాడుతుంది. ఇప్పటికే వాటిని చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు వాడుతున్నాయి. దీనితో చైనా కూడా తాజా కేసులు పిల్లల వలన పెరుగుతున్నట్టు గ్రహించి వారికీ టీకాలు ఇవ్వడం ప్రారంభించింది.

చైనాలో ప్రాంతీయంగా తయారుచేసిన టీకాలు 3-11 ఏళ్ళ పిల్లలకు ఇస్తున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పూనుకుంది చైనా. తాజాగా కేసులు బయటపడ హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్ ప్రావిన్స్ లలో పిల్లలకు టీకాలు ఇస్తున్నారు. ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ఇప్పటికే 76 శాతం మందికి కరోనా టీకాను ఇచ్చేశారు. వాళ్లకు కూడా దేశీయంగా తయారైన సినోఫామ్, సినోవాక్ లనే ఇచ్చారు. ఈ రెండు అందరిపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు చైనా అయితే చెప్పుకుంటుంది.

ఇతర కొత్త వేరియంట్ల మీద అంటే డెల్టా వంటి వాటి మీద ఈ టీకాలు పనిచేస్తున్నది లేనిది మాత్రం ప్రపంచానికైతే తెలియదు కానీ, చైనా మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకుంటుంది. డెల్టా వేరియంట్ నుండి సినోఫామ్, సినోవాక్ రక్షణ కల్పిస్తున్నట్టు చైనా అంటుంది. ప్రపంచానికి చైనా కరోనా అంటించింది అన్న అపవాదు మోస్తూ కూడా తనవరకు వాక్సిన్ చేసుకుని ముందుగానే ఆ వైరస్ నుండి బయటపడింది. కానీ అప్పుడప్పుడు మరోసారి అక్కడ కూడా కరోనా విజృంభణ ఉంటోంది. అధికారికంగా మరణాల రేటు చైనా విడుదల చేసినా దానివెనుక ఎంత నిజం ఉన్నది ప్రపంచానికి తెలిసిందే. తాజాగా చైనాకు ఐక్యరాజ్యసమితి పంపిన మరో బృందం కూడా కరోనా మూలాలు కనుగున్నది లేనిది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: