చైనా ఐక్యరాజ్యసమితిలో చేరి 50 ఏళ్ళు గడుస్తున్నందున అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ, సమితిలో నిర్ణయాలు ఉమ్మడిగా తీసుకోబడతాయి, ఒంటరిగా ఎవరూ తీసుకోరు, అలా ఇష్టానికి ఎవరు తీసుకున్నా మిగిలిన వారు ఒప్పుకోరు అన్నాడు. సమితిని అడ్డం పెట్టుకొని చైనా మరోసారి అమెరికాను పరోక్షంగా హెచ్చరించిందని నిపుణులు అంటున్నారు. సమితి నిర్దేశించిన అంతర్జాతీయ చట్టాలు సభ్యులైన అందరు పాటించాల్సి ఉంటుంది. అంతేకాని ఎవరో కొందరు ఈ చట్టాలను నిర్దేశించలేవు. సమితి అధికారాన్ని అందరు ఆమోదించాలి, సమితి పట్ల నిబద్దత ఉండాలి. ఎవరు ఇష్టానికి వాళ్ళు ప్రవర్తించడం సమితికి సంబంధం లేదని, వాళ్ళ ఇష్టాన్ని సమితి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని అన్నాడు.

ఇంత చెప్పిన జిన్ గారు మాత్రం ఆయన ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. ఆయా దేశాలను ఆక్రమించేస్తున్నారు. సందు దొరికితే సరిహద్దు దేశాలమీదకు పోతున్నారు. ఇవన్నీ మరి సమితి ప్రకారం అంతర్జాతీయ చట్టపరిధిలోకి రావా ఏమిటో ఆయనే చెప్పాలి. కేవలం తనకు మాత్రం అన్నీ వర్తించవు కానీ, మిగిలిన వాళ్ళు మాత్రం చెప్పినట్టు వినాలని జిన్ గారు అనుకోవడంలోనే ఆయన ప్రపంచాన్ని కూడా తమ చెప్పుకింద పెట్టుకోవాలని చూస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఒక నియంత మాదిరి, చుసిన దానిని కావాలి అనుకోవడం సమితి నిర్దేశించిన అంతర్జాతీయ చట్టాల కిందకు రాదా మరి జిన్ను గారు మీరే చెప్పాలి.  ఇవన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సాగించుకుంటాడు, వ్యతిరేకంగా ఎవరైనా ఉంటె మాత్రం వాళ్లకు హెచ్చరికలు, వాళ్ళు మాత్రం అంతర్జాతీయ చట్టాలు అనుసరించాలి, జిన్ దగ్గరే ఈ పాఠాలు నేర్చుకోవాలి ఇక.  

ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు ఉన్నాయి. అన్నీ భారత్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ చైనా ఒక్కటి చేయంగ సమితిలో శాశ్వత స్థానం భారత్ కు దక్కలేదు. జిన్ను గారు ఇలాంటి కుట్రలు అంతర్జాతీయ చట్టాలకు అనుకూలమేనా, కాస్త చెప్పండో. పొద్దున్న లేస్తే ఎవడి భూమి లాక్కుందాం, ఏ బక్కోడి మీద పడి తిందాం అనే రాక్షసుడు, నీతులు చెప్పినట్టే ఉంది మీరు చట్టాలకు గురించి మాట్లాడుతుంటే. నిన్ను నేతగా అంగీకరించి, భరిస్తున్న వాళ్లకు దండం పెట్టాలి. అంతా నాశనం అయినా ఇంకా ఏదో ఉన్నట్టు డాంబికాలు పోతుండటం మీ తరువాతే నండి జిన్ను గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: