చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు మారుతాయా అనే చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, టీడీపీ కార్యాల‌యం దాడులు అలాగే రాష్ట్రంలో ఆర్టిక‌ల్ 365 ను విధించాలనే డిమాండ్ తో ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసేందుకు చంద్ర‌బాబు వెళ్లాడ‌ని టీడీపీ అధికారికంగా ప్ర‌క‌టించింది. రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, హోంమంత్రి క‌లుస్తామ‌ని చెప్పారు. కానీ, త‌మ డిమాండ్ కు ఢిల్లీ పెద్ద‌లు సానుకూలంగా స్పందించార‌ని చెబుతార‌ని.. అయితే, వీళ్ల‌తో చంద్ర‌బాబు భేటి అయినా దానికి స‌రైన ఫ‌లితాలు రావ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


  ఎందుకంటే గ‌తంలోనే  ఎంతో హింస చెల‌రేగిన బెంగాల్‌లోనే రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్ట‌లేదు. అలాంటిది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడుతారా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. సొంత పార్టీపైనే తృణ‌ముల్ కాంగ్రెస్ దాడి చేస్తేనే బీజేపీ క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయింది. ఇక టీడీపీ కోసం కేంద్రం ముందుకు వస్తుందా అంటే అది కానీ ప‌ని అని తెలుస్తోంది. అయితే, రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే.. చాలాం కాలంగా చంద్ర‌బాబు బీజేపీకి ద‌గ్గ‌ర కావ‌డానికి ఒక అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నాడు.ఇప్పుడు తాజా ప‌రిణామాల పేరు చెప్పుకుని మోడీ, అమిత్ షా ల‌ను క‌లిసి మ‌ళ్లీ రాజ‌కీయ చెలిమి కోసం చ‌ర్చిస్తాడ‌ని అంటున్నారు.   దీనికి చంద్ర‌బాబు గ‌త రెండేళ్ల నుంచి అనుస‌రిస్తున్న విధానాలు బ‌లం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల ఓట‌మి అనంత‌రం మోడీ విధానాల‌ను స‌మ‌ర్థిస్తూ వ‌చ్చాడు చంద్ర‌బాబు. దీంతో బీజేపీతో  మ‌ళ్లీ స్నేహం చేసేందుకు సానుకూల సంకేతాలు కూడా పంపారు. కానీ, ఇందుకు బీజేపీ సిద్దం కాలేదు.. ఎందుకంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది.


దీంతో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్ని వింటారు కానీ త‌రువాత చూసుకుంటామ‌ని చెబుతార‌ని అంటారు. దీంతో ఇటు చంద్ర‌బాబును ,  అటు జ‌గ‌న్‌ను లైన్ లో పెడుతారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రికి ఓకే చెప్పాల‌ని  నిర్ణ‌యించుకుంటారు. కానీ, 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు చంద్ర‌బాబు ప్ర‌భావం ఎముండ‌ద‌ని దీని వ‌ల్ల బాబు ఢిల్లీ టూర్ వ‌ల్ల రాష్ట్రంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవంటున్నారు విశ్లేష‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: