క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది.  ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగా జరుగుతోంది.  ఉత్కంఠభరితంగా సాగుతున్న టి20 వరల్డ్ కప్ ను ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్టేడియంలోకి ప్రేక్షకులను కూడా అనుమతి ఇస్తూ ఉండడం తో..  ఎంతో మంది ప్రేక్షకులు యూఏఈ చేరుకొని ఇక ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉండటం గమనార్హం.  ఇకపోతే ఇటీవలే చిరకాల ప్రత్యర్థిలుగా ఉన్న పాకిస్థాన్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.



 ప్రపంచ క్రికెట్ సమాజం చూపును మొత్తం ఆకర్షించిన  ఈ మ్యాచ్ ఎంతో హోరాహోరీ గానే జరిగింది. అయితే ఇక ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఘన విజయాన్ని సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికింది.  మొదటినుంచి టీమిండియాపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కనబరిచింది పాకిస్థాన్ జట్టు. ఒక వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించింది అని చెప్పాలి. అయితే సాధారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు ఇండియా అభిమానులు టీమిండియాకు సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.



 ఒకవేళ క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ చూస్తూ టీమిండియా గెలవాలని కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెల్సిందే. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ జట్టుకు సపోర్ట్ చేసింది. చివరికి ఉద్యోగాన్ని కోల్పోయింది. రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంలో దాయాది జట్టు పాకిస్తాన్ కి మద్దతు ప్రకటించింది. పాక్ జట్టు విజయం సాధించిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్టేటస్ కూడా పెట్టింది. మీరు పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నారా అని విద్యార్థుల తల్లిదండ్రులు అడగ్గా  అవును అని సమాధానం చెప్పింది   ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది స్కూల్ యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: