బద్వేలు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ కోసం అధికార పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం మనం చూస్తున్నాం. ఇక బద్వేలు ఉప ఎన్నికలలో  గోపవరం మండలం  రా సాయిపేట లో వైసిపి బహిరంగ సభ నిర్వహించగా ఈ సభకు ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరు అయ్యారు. 2019లో జగనన్న మీద అభిమానంతోనే స్వర్గీయ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యను 45 వేల మెజార్టీతో గెలిపించారు అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా  గెలుపు కోసమే ప్రచారం చేస్తాం  అని స్పష్టం చేసారు.

కానీ ఇక్కడ వైసిపి మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నాం అని ఆమె అన్నారు.  మేనిఫెస్టోను వంద శాతం పూర్తి చేసిన ఒకే ఒక్క సిఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయాడు అని విమర్శించారు. ఎంత అప్పు ఉన్నా రాష్ట్ర ప్రజల కోసం ..సంక్షేమం కోసం  మాటమీద నిలబడే కుటుంబం వైఎస్ కుటుంబం అని ఆమె పేర్కొన్నారు. కులం చూడం మతం చూడం పార్టీలు చూడం అని వాగ్దానం చేసి అమలు చేసిన ఏకైక సిఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే రోజా  అన్నారు.

జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్లే ఉంది అని ఆమె స్పష్టం చేసారు. బద్వేల్ ఉప ఎన్నికలలో కూడా గత మెజార్టీ కంటే డబుల్ గా మెజారిటీ ఇచ్చి జగనన్నకు కానుకగా ఇవ్వండి అని విజ్ఞప్తి చేసారు. ఎన్ని పార్టీలు గుంపులుగుంపులుగా వచ్చిన వైసిపి సింగిల్ గా పోటీ చేస్తుంది అని స్పష్టం చేసారు. ఈ ఎన్నికలలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్... రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీలకు బుద్ధి చెప్పండి అని ఆర్కే రోజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: