కోదాడ లో నిన్న జరిగిన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం పై mla క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కోదాడ నుంచి హుజూర్నగర్ పారిపోయి కొత్త కాంట్రాక్టర్ల ద్వారా అక్రమంగా సంపాదించిన ఘనుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఫైర్ అయ్యారు బొల్లం మల్లయ్య.
లిఫ్టులు పేరుమీద ఇండ్ల పేరుమీద  పైరవీల పేరు మీద సంపాదించిన సంపద  నువ్వు కాదా ? అని నిలదీశారు. 1994 లో డోక్కు కారులో వచ్చి 2014లో హైదరాబాద్ నుండి కోదాడ కు డబ్బులు తరలిస్తుంటే సూర్యాపేట వద్ద తగలబడ్డవి అక్రమంగా సంపాదించినవి  కావా ? అని ప్రశ్నించారు బొల్లం మల్లయ్య.  


1999 సంవత్సరం లో డబ్బుల సంచుల తో కోదాడ కి వచ్చి గెలిచింది కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని నిప్పులు చెరిగారు బొల్లం మల్లయ్య. ఆ విధంగా నాకు ఎవరు బిక్ష పెట్టలేదన్నారు.  గతం లో  ఉసిక అయినా మైనింగ్ అయినా వైన్స్ అయినా సిండికేట్ గా ఏర్పడి నీ వాళ్లే సిండికేట్ నడిపించేది. నీ నాయకులే  నేటికీ కొనసాగిస్తున్నారని అగ్రహించారు బొల్లం మల్లయ్య.  కాలం చెల్లిన కాంగ్రెస్ వాళ్లకు నేను చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు.  కోదాడ నియోజకవర్గంలో అన్ని పథకాలు అన్ని పార్టీలకు అందేలా కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు బొల్లం మల్లయ్య.
 
సామాన్యులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ నాయకత్వంలో అది మీకు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు బొల్లం మల్లయ్య.  పరాయి నియోజకవర్గం నుండి కార్ల లో కిరాయికి తీసుకువచ్చి మీటింగ్ నడిపించు కున్నావని నిప్పులు చెరిగారు.
 నర్సింహులగూడెం లాంటి గ్రామంలో హత్యలు చేయించిన నీచ బుద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డిదని మండిపడ్డారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని..  కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావటానికి కారకుడివి నువ్వు కాదా... ? అని ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: