దీపావళికి ముందే రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం జగన్ చేశారు అని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు అన్నారు. ఒకేరోజు మూడు పథకాలకు చెందిన నగదు జమ చేశారు అని ఆయన పేర్కొన్నారు. రెండున్నారేళ్లలో సీఎం జగన్ 18,777 కోట్లు రైతు భరోసా కింద రైతులకు ఇచ్చారు అని టీడీపీ హయాంలో ఐదేళ్లలో రుణమాఫీ కేవలం 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అని పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేశారు అని స్పష్టం చేసారు.

రాష్ట్ర ఖ్యాతిని తగ్గించేలా ఢిల్లీలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు చేసారు. స్వార్థ రాజకీయాల కోసం పొరుగు రాష్ట్రాల వాళ్ళ దగ్గర పరువు తీస్తున్నారు అని ఆరోపణలు చేసారు. అమిత్ షా, మోడీలను మీరు ఎన్ని తిట్లు తిట్టారో వాళ్ళకి తెలుసు అని అన్నారు. ఈరోజు వెళ్లి అపాయిట్మెంట్ కోసం వాళ్ళ కాళ్ళ వేళ్ళా పడుతున్నారు అని ఎద్దేవా చేసారు. ఢిల్లీలో డ్రామాలు ఆడడం చంద్రబాబుకి కొత్త కాదు.. చంద్రబాబు కుటిల బుద్ధులు ఢిల్లీ వాళ్ళకి తెలుసు అని అన్నారు ఆయన. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఢిల్లీ పెద్దలకు మేము చెబుతాం అని వివరించారు.

దిగజారుడు రాజకీయాలు చేస్తున్న టీడీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అన్నారు. అమరావతి రాజధాని ఏమయ్యిందని రాష్ట్రపతి అడిగారట.. నాశనం చేసారని చంద్రబాబు చెప్పారట అంటూ ఎద్దేవా చేసారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే హక్కులు పోగొట్టింది చంద్రబాబు కదా..? అని నిలదీశారు. ఓటుకు నోటు కేసు కోసం హైదరాబాద్ వదిలి వచ్చారు అని అన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు అని విమర్శలు చేసారు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలో కేంద్రానికి తెలియదా.. ఈయన చెప్పిన అపార్ధాలు వాళ్ళు నమ్మరు అని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సభ కు పవన్ వచ్చి ఏమి చెప్తారో చూద్దాం అని అన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నారుకదా కేంద్రాన్ని ఏమి ప్రశ్నిస్తారో చూడాలి అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap