తెలంగాణలో రాజ‌కీయాలు కానీ అధికారుల తీరు క‌న్నా చాలా భిన్నంగా ఉంటాయి. అవి సామాన్య ప్ర‌జ‌ల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుం టాయో కానీ ప్ర‌భువుల మెప్పు మాత్రం బాగా పొందేందుకు తెగ ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. ఇప్ప‌టికే ఇలాంటివి జ‌రిగినా కూడా కొత్త వి కొన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఘ‌ట‌న‌ల రూపంలో జ‌రుగుతూనే ఉంటాయి..ఉన్నాయి కూడా! రైతులు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డి వ‌రి సాగుకు పుష్క‌ల‌మయిన కృషి చేస్తుంటే, ధాన్యం కొనుగోలుకు మాత్రం కేసీఆర్ కు మ‌న‌సు రావ‌డం లేద‌న్న ఆరోప‌ణ ఎప్ప‌టి నుంచో ఉంది. ఈ స్థితిలో వ‌రి త‌గ్గించి మిగ‌తా పంట‌లు వేయాల‌ని కేసీఆర్ తెలివిగా చెబుతున్నారు. ఆ మాట‌కు వ‌స్తే గ‌తంలో సాగు అయిన మొక్క జొన్న‌కు కానీ ప‌సుపు పంట‌కు కానీ కేసీఆర్ చేసిన సాయం ఎంత‌న్న‌ది లెక్క‌లలో చూస్తే మ‌న‌కు ఆశ్చ‌ర్యంతో పాటు బాధ కూడా క‌ల‌గ‌క మాన‌దు. ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి సారించాల‌ని చెప్ప‌డం వేరు ఆ విధంగా చెప్పి ప్రోత్స‌హించ‌డం వేరు కానీ కేసీఆర్ క‌లెక్ట‌ర్ మాత్రం అలా లేడు. శివ‌గామి రేంజ్ లో రెచ్చిపోయాడు.

ఎలా అంటే... :
సిద్ధి పేట క‌లెక్ట‌ర్ వెంక‌ట రామిరెడ్డి రూటే సెప‌రేటు. అంతా ఏం అనుకున్నా ప‌ర్లేదు కానీ త‌న మాట సుప్రీం కోర్టు ఆర్డ‌ర్ క‌న్నా గొప్ప‌ది అని తేల్చేశాడు. వ‌రి వేస్తే రైతుల అంతు చూస్తాన‌ని, త‌న మాటే శాస‌నం అని శివ‌గామి రేంజ్ లో విరుచుకుప‌డ్డాడు. జిల్లాలో త‌న ఆర్డ‌ర్ ను కాద‌ని ఎవ్వ‌రు వ‌రి విత్త‌నాలు విక్ర‌యించినా ఆ షాప్ ను ఇక తెర‌వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చేశాడు. తాను ఉన్నంత వ‌ర‌కూ  వ‌రి ఊసు ఎత్తడానికే వీల్లేద‌ని అంటున్నాడు. ఒక‌వేళ రాజ‌కీయ పైర‌వీల కార‌ణంగా  ఎవ్వ‌రైనా తెరిచినా, లేదా మ‌రో దారిలో కోర్టు ద్వారా ఆర్డ‌ర్ తెచ్చుకున్నా తాను ఊరుకునేదే లేద‌ని తేల్చి చెబుతున్నాడు. దీంతో ఈ వార్త వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే కేసీఆర్ కూడా వ‌రి వ‌ద్దు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై దృష్టి సారించాల‌ని చెబుతున్నా కూడా రైతులు మాత్రం ఆ మాట వినిపించుకునే స్థితిలో లేరు.ఈ ద‌శ‌లో సిద్ధి పేట క‌లెక్ట‌ర్ కాస్త చ‌నువు మ‌రియు చొర‌వ తీసుకుని రైతుల‌కు సంబంధించి ఓ స్టేట్మెంట్ ఇచ్చిప‌డేశాడు. ఈ సీన్ పై హుజురాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న హ‌రీశ్ రావు ఏమంటాడో మ‌రి!

మరింత సమాచారం తెలుసుకోండి: